»   » మహేష్ బాబు ఇష్యూ: శ్రీదేవి కూతురును అనవసరంగా తిట్టిపోసారుగా...!

మహేష్ బాబు ఇష్యూ: శ్రీదేవి కూతురును అనవసరంగా తిట్టిపోసారుగా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు కొత్త సినిమా మొదలవుతుందంటే చాలు రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వస్తుంటారు. మహేష్ బాబు హీరోగా మురుగదాస్ మూవీ ప్రారంభం అవుతుందన్న విషయం బయటకు వచ్చిన తొలినాళ్లలో హీరోయిన్ ఎవరనేది అప్పటికి అఫీషియల్ గా ఖరారు కాని నేపథ్యంలో రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఆ రూమర్స్ తర్వాత ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఖరారైంది.

మాజీ మంత్రి మనవడితో శ్రీదేవి కూతురు ముద్దుల్లో మునిగి..(షాకింగ్ లీక్ ఫోటోస్)

గతంలో ఈ సినిమాలో పరిణీతి చోప్రాను తీసుకుంటున్నారని ఒకసారి, అలియా భట్ తో మంతనాలు జరుపుతున్నారని మరోసారి వార్తలు వచ్చాయి. దీని తర్వాత శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చినా జాన్వి కపూర్ రిజక్ట్ చేసిందంటూ పుకార్లు షికార్లు చేసాయి.

శ్రీదేవికి ట్యూషన్లో ఐ లవ్‌ యూ చెప్పా, భయపెట్టింది... (చిన్న నాటి జ్ఞాపకాలు)

మహేష్ బాబు సినిమాను ఝాన్వి రిజక్ట్ చేసిందనే విషయం సోషల్ మీడియాలో పాకగానే...ఫ్యాన్స్ ఆమె తీరుపై రుసరుసలాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన అసలు వాస్తవం ఏమిటంటే ఈ సినిమా కోసం అసలు జాన్వి కపూర్ ను అప్రోచ్ కూడా కాలేదట చిత్రబృందం.

చిత్ర బృందం పరిణీతి చోప్రాతో మాత్రమే డీలింగ్స్ చేసారట...కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం లేకుండా పోయింది. ఆలియా భట్ తో సంప్రదింపులు జరిపారట. వీరిద్దరి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ను ఖరారు చేసారు.

అందుకే ఆయన రోల్ మోడల్, మహేష్ బాబు లైఫ్ స్టైల్ సూపర్ (ఫోటోస్)

ఈ ముగ్గురు హీరోయిన్లు తప్పించి అసలు ఎవర్నీ చిత్ర బృందం సంప్రదించక పోయినా...శ్రీదేవి కూతురు పేరు ఎలా తెరపైకి వచ్చిందో అర్థం కావడం లేదు. అసలు శ్రీదేవి కూతురు వయసు, పర్సనాలిటీ ఏమిటి? మహేష్ బాబు లాంటి హీరోకు ఆమె ఎలా సెట్టవుతుంది? అలి ఆలోచన కూడా మాకు రాలేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యుడు ఒకరు వెల్లడించారు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు..

అనవసరంగా..

అనవసరంగా..

అప్పుడు ఏవో రూమర్స్ విని శ్రీదేవి కూతురు జాన్విని అనవసరంగా తిట్టిపోసాంటూ కొందరు పశ్చాత్తాపడుతున్నారట.

షూటింగ్

షూటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ద్విబాషా చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

రాత్రి పూటే..

రాత్రి పూటే..

కథ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ షూటింగ్ అంతా రాత్రి వేళల్లోనే జరుగుతోంది. వారం రోజుల పాటు రాత్రి షూటింగే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

మహేష్ భార్య గెస్ట్ రోల్

మహేష్ భార్య గెస్ట్ రోల్

మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఈ సినిమాలో నటిస్తోందట. అయితే ఫుల్ లెంగ్త్ మాత్రం కాదు.... ఆమె ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్.

సెకండ్ హీరోయిన్?

సెకండ్ హీరోయిన్?

సినిమాలో మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే సినిమాలో గెస్ట్ హీరోయిన్ (సెకండ్ హీరోయిన్)పాత్ర కూడా ఉంటుందని, అందులో నమ్రత నటిస్తోందని అంటున్నారు. గతంలో మహేష్, నమ్రత కలిసి వంశీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

English summary
“We wanted to cast a fresh face initially, so we approached Parineeti and even considered Alia Bhatt, but never Jhanvi,” Mahrsh Babu-Murugadoss movie project source said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu