»   » ఒక్కడు మాత్రమే మహేష్ బాబు నమ్మకాన్ని నిలబెట్టాడు!

ఒక్కడు మాత్రమే మహేష్ బాబు నమ్మకాన్ని నిలబెట్టాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'బ్రహ్మోత్సవం' భారీ ప్లాపుగా నిలిచిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఓ సినిమా హిట్టయినపుడు లేదా ప్లాపయినపుడు కారణాలను అన్వేషిస్తుంటారు. ఏదైనా సెంటిమెంట్ ఫాలో అవుతుందా? గత సినిమాలతో పోలిస్తే ఒకే రకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై ఫోకస్ పెడతారు.

మహేష్ బాబు మరో ప్లాపును ఎదుర్కొన్న నేపథ్యంలో....విశ్లేషకులు గత సినిమాల్లో హిట్లు, ప్లాపులు, ఎవరి దర్శకత్వంలో భారీ హిట్లు కొట్టారు, ఎవరి వల్ల భారీ ప్లాపు ఎదుర్కొన్నారనే విషయాలను తిరగతోడారు.

అయితే మహేష్ బాబు హిట్లు, ప్లాపుల విషయంలో ఓ విషయం కామన్ గా కనిపిస్తోంది. గతంలో మహేష్ బాబుతో చేసిన తొలి అవకాశంలో హిట్స్ అందించిన దర్శకులు రెండో సారి మాత్రం ప్లాపులు అంటగట్టారని తేలింది.

ఒకసారి హిట్ ఇచ్చాడని మహేష్ బాబు వారిని బాగా నమ్మడం....మరో ఛాన్స్ ఇవ్వడం లాంటివి చేసారు. అయితే అలా చేసి ప్రతిసారి మహేష్ నమ్మకం ఒమ్మయింది. అయితే ఓ దక్శకుడి విషయంలో మాత్రం అలా జరుగలేదు. ఆ దర్శకుడు ఎవరు? ఇతర పూర్తి వివరాల స్లైడ్ షోలో...

గుణశేఖర్

గుణశేఖర్


మహేష్ బాబుకు ఒక్కడు సినిమాతో భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ తర్వాత అర్జున్, సైనికుడు లాంటిప్లాపులు అందించాడు. గుణపై మహేష్ పెట్టుకున్న నమ్మకం ఒమ్మవ్వడంతో మహేష్ మళ్లీ ఆ దర్శకుడితో చేయలేదు.

త్రివిక్రమ్

త్రివిక్రమ్


త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ‘అతడు' మంచి హిట్టయింది. అయితే అదే దర్శకుడు ‘ఖలేజా' రూపంలో మహేష్ బాబుకు ప్లాపు అందించాడు. అప్పటి నుండి ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు.

శ్రీను వైట్ల

శ్రీను వైట్ల


దూకుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీను వైట్ల.... తర్వాత ‘ఆగడు' రూపంలో భారీ ప్లాపు అందించాడు.

శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూపంలో మంచి హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.... ఇపుడు బ్రహ్మోత్సవం రూపంలో భారీ ప్లాపు మిగిల్చాడు.

పూరి జగన్నాథ్ మాత్రం అలా కాదు..

పూరి జగన్నాథ్ మాత్రం అలా కాదు..


పూరి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘పోకిరి' ఇండస్ట్రీ హిట్. రెండో అవకాశంలో కూడా ‘బిజినెస్ మేన్' రూపంలో మరో హిట్ అందించాడు పూరి. అందుకే పూరితో మరో సినిమా చేస్తున్నాడు మహేష్. ‘జన గణ మన' పేరుతో ఈ సినిమా రాబోతోంది.

English summary
After Brahmostavan Mahesh babu movies hits and flop analysis.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu