»   » నాగచైతన్య కోసం బజారుకెక్కిన మహేష్ బాబు..!!

నాగచైతన్య కోసం బజారుకెక్కిన మహేష్ బాబు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున తనయుడు నాగచైతన్య నటించిన చిత్రం 'ఏ మాయ చేసావే'. చైతన్య నటించిన మొదటి చిత్రం జోష్ ఫెయిల్యూర్ అవ్వడంతో పాటు చైతన్య పర్ఫార్మెన్స్ కూడా నిరాసపరచడంతో ఆయన నటించిన రెండో సినిమాకు కనీస స్థాయి క్రేజ్ కూడా ఏర్పడలేదు. ఏదో బి-గ్రేడ్ హీరో సినిమా విడుదల అవుతున్నట్టు వుంది వాతావరణం. దీంతో ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి నాగార్జున, నిర్మాత నిర్మాత మంజుల ఇప్పటికే నడుం బిగించారు. వీరిద్దరూ ఈ సినిమా గురించి కొంచం ఓవర్ గానే ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా కోసం నాగ్ తన మిత్రుడు శివప్రసాద్ ను నట్టేటముంచేసాడు. మంజుల అయితే ఇంతవరకూ వచ్చిన సినిమాలను చెత్త సినిమాల కింద జమకట్టేసింది.

ఇహ ఇప్పుడు మంజుల సోదరుడు ప్రిన్స్ మహేష్ బాబు వంతు వచ్చింది. అసలే రెండున్నర ఏళ్ల నుండీ ఆయన సినిమా కోసం అభిమానుల కళ్లు కాయలు కాస్తుంటే, వారి బాధను తీర్చేందుకా అన్నట్టు ఆయన ఇలా పబ్లిసిటీ ప్రకటనల్లోనూ, వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తున్నారు. మహేశ్ ఇంతకు ముందు మంజుల నటించిన కావ్యాస్ డైరీ సినిమా కోసం కూడా ప్రచారం చేసాడు. ఇప్పుడీ చిత్రం కోసం... ప్రచారం చేస్తున్నాడు. కావ్యాస్ డైరీకి ఏ మాత్రం ఉపయోగపడని మహేష్ కనీసం ఈ చిత్రం క్రేజ్ పెంచడానికైనా ఉపయోగపడాలని ఆశిద్ధాం. అయినా సినిమా బాగుంటే క్రేజ్ అదే వస్తుంది.. ఏమంటారు..!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu