»   » ‘మర్యాద రామన్న’ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ సృష్టిస్తుంది: మహేష్ బాబు..

‘మర్యాద రామన్న’ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ సృష్టిస్తుంది: మహేష్ బాబు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా అతని అభిమానులతో ఎన్నో అనుభూతులను పంచుకుంటున్నాడు. తాజాగా రాజమౌళిపై తనకున్న అభిమానాన్ని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. ఇలా కంటిన్యూగా సక్సెస్ లు సాధించడం ఎవ్వరి వల్ల కాదు. అది రాజమౌళికే సాధ్యమయ్యింది. ఇలాంటి వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం. త్వరలో రాబోయే రాజమౌళి తదుపరి చిత్రం 'మర్యాదరామన్న" కూడా బాక్సీపీస్ వద్ద మ్యాజిక్ సృష్టిస్తుందని నమ్ముతున్నాను అని ట్విట్టర్ లో మెసేజ్ పోస్ట్ చేసాడు మహేష్ బాబు. రాజమౌళి పై ప్రిన్స్ చూపిస్తున్న అభిమానం చూస్తుంటే అతని డైరెక్షన్ లో మహేష్ సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నట్టు అనిపిస్తోంది. సలోని హీరోయిన్ గా ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు అందించారు. ఈ చిత్రంలోని పాటల్ని జులై 4న విడుదల చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu