»   » ఊటీలో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ (లొకేషన్ పిక్స్)

ఊటీలో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ (లొకేషన్ పిక్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం ‘శ్రీమంతుడు'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సాంగుతో పాటు కొన్ని సీన్లు చిత్రీకరించారు. ప్రస్తుతం ఊటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

సినిమాలోని ముఖ్యతారాగణం మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత, రేవతి, తులసి, సత్యరాజ్, నరేష్, జయసుధ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. బ్రహ్మోత్సవం సినిమా ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెకెక్కుతోంది. గతంలో మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఊటీలో షూటింగ్ డిసెంబర్ 13న మొదలైంది. డిసెంబర్ 22 వరకు ఇక్కడే షూటింగ్ జరుగబోతోంది. ఇక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు క్రిస్ మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ కు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసారు. స్లైడ్ షోలో ఊటి షూటింగుకు సంబంధించిన ఫోటోస్...

మహేష్ బాబు

మహేష్ బాబు


బ్రహ్మోత్సవం ఊటీ షూటింగులో మహేష్ బాబు.

ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఫ్యామిలీ ఎంటర్టెనర్


ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ‘బ్రహ్మోత్సవం' చిత్రం తెరకెక్కుతోంది.

భారీ తారాగణం

భారీ తారాగణం


మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత, రేవతి, తులసి, సత్యరాజ్, నరేష్, జయసుధ లాంటి భారీ తారాగణంతో సినిమా తెరకెక్కుతోంది.

ఫిల్మీ సిటీ షూటింగ్

ఫిల్మీ సిటీ షూటింగ్


రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బ్రహ్మోత్సవం' షూటింగ్ జరిగినపుడు షారుక్ ఖాన్ సెట్స్ ను సందర్శించారు.

మహేష్ బాబు డ్యూయెల్ రోల్

మహేష్ బాబు డ్యూయెల్ రోల్


మహేష్ బాబు ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. కాజల్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మీకూ నటించే అవకాశం

మీకూ నటించే అవకాశం


నటించే ఆసక్తి వున్నవారు తమ ఫ్యామిలీకి సంబంధించిన రెండు ఫోటోలు, కాంటాక్ట్‌ డీటైల్స్‌ను pvpcinema@pvpglobal.com అనే మెయిల్‌ ఐడికి పంపించాల్సిందిగా పివిపి సినిమా టీమ్‌ కోరుతోంది.

అభిమానులతో...

అభిమానులతో...


సినిమా సెట్లో అభిమానులతో కలిసి మహేష్ బాబు.

English summary
Mahesh Babu, who scored a tremendous success this year with Srimanthudu, did not really take a long break from shooting and the actor quickly moved to his next offering, Brahmotsavam. While the team already shot a song and few key scenes at Ramoji Film City, in the first schedule, the second schedule is currently progressing at a brisk pace in Ooty.
Please Wait while comments are loading...