»   » మహేస్, ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ అడ్డదారిలో.... కొంపముంచారు!

మహేస్, ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ అడ్డదారిలో.... కొంపముంచారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో హీరో బేస్డ్ ఫ్యాన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయారు. ఒక హీరోను అభిమానించే ఫ్యాన్స్ తమ హీరోను టాపులో నిలబెట్టడానికి ఏ పని చేయడానికైనా వెనకాడటం లేదు. పలుమార్లు అభిమానం హద్దులు దాటుతోంది. కొన్ని విషయాల్లో ఫ్యాన్స్ కాస్త ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు అభిమానులు అడ్డదారులుతొక్కుతున్నారు. దీంతో దర్శక నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పలానా హీరో సినిమా ట్రైలర్ ఎక్కువ హిట్స్ తెచ్చుకుందంటే.... మరో హీరో ఫ్యాన్స్ తమ హీరో సినిమా ట్రైలర్ కు అంతకు మించి ఎక్కువ హిట్స్ తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఫేక్ క్లిక్స్ తెచ్చేందుకు పేజీని వందల సార్లు రిఫ్రెష్ చేస్తుండటం లాంటివి చేస్తున్నారట.

Mahesh Babu, Prabhs, Allu Arjun fans over reaction

తాజాగా బాహుబలి ట్రైలర్ ‘యూట్యూబ్' తొలగించడానికి కారణం అదే అని అంటున్నారు. ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు. గతంలో మహేష్ బాబు ‘1-నేనొక్కడినే' సినిమా ట్రైలర్ విషయంలో ఇదే జరిగింది. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాకు సంబంధించి ఆదిత్య మ్యూజిక్ వారి జూక్ బాక్స్ లో ఇలాంటి సమస్యే ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఆయా సినిమా దర్శకులు నిర్మాతలు...అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్లను చూడండి, షేర్ చేయండి. అంతేకానీ ఇలా ఆర్టిఫిషియల్ గా హిట్స్ తెచ్చేందుకు మాత్రం ప్రయత్నించ వద్దు అని కోరుతున్నారు.

English summary
“Some of Mahesh Babu, Prabhs, Allu Arjun fans have tried to increase views artificially by repeatedly refreshing the page without viewing the trailer. Even a small percentage of artificial views like this is taken very seriously by Google “, said the source.
Please Wait while comments are loading...