»   » మహేష్ చేతుల మీదుగా సైకిల్ అందుకుంటూ... (వీడియో)

మహేష్ చేతుల మీదుగా సైకిల్ అందుకుంటూ... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌ బాబు, శ్రుతిహాసన్‌లు జంటగా నటించిన శ్రీమంతుడు చిత్రంలో మహేష్ ఉపయోగించిన సైకిల్‌ని కరీంనగర్‌కు చెందిన నాగేంద్ర రెడ్డి అందుకున్నారు. ఈ సైకిల్‌ కోసం శ్రీమంతుడు చిత్ర బృందం నిర్వహించిన కాంటెస్ట్‌ లక్కీడ్రాని ఇటీవల మహేష్ చేతుల మీదుగా తీశారు. ఇందులో విజేతగా నిలిచిన కరీంనగర్‌ వాసి నాగేంద్రరెడ్డికి మహేష్ చేతుల మీదుగా సైకిల్‌ని అందజేసారు. విజేత నాగేంద్ర రెడ్డి కుటుంబ సమేతంగా ఈ సైకిల్‌ని స్వకరించారు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.


మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.


మహేష్‌ మాట్లాడుతూ ''దర్శకుడు కథ చెప్పగానే ఒక మంచి సినిమా చేయబోతున్నాననే నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసింది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి 'శ్రీమంతుడు' ఒక స్ఫూర్తినిచ్చింది'' అన్నారు.


Mahesh2

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Mahesh Babu presents Srimanthudu cycle to the contest winner on the occasion of Srimanthudu 100 days celebrations. Srimanthudu Movie features Mahesh Babu and Shruti Haasan. Devi Sri Prasad composed the music under the direction of Koratala Siva.
Please Wait while comments are loading...