»   » మహేష్ తో 'ఛత్రపతి శివాజి'?? అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి రాజమౌళి ఓకే చెప్తాడా??

మహేష్ తో 'ఛత్రపతి శివాజి'?? అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి రాజమౌళి ఓకే చెప్తాడా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారికి చత్రపతి శివాజీ క్యారెక్టర్ అంటే అత్యంత ఇష్టంగా ఉండేదట. కానీ ఆయన ఆ సినిమా చేయలేకపోయారు. కానీ ఆ లోటుని కీరవాణి తంద్రిగారైన శివ సక్తి దత్తా తీసిన "చంద్రహాస్" సినిమాలోనూ, అపట్లో ఎస్వీ కృస్ణా రెడ్ది తీసిన అమ్మదొంగ లో ఒక పాటలోనూ కాసేపు ఆ గెటప్ లో కనిపించి తన కోరిక అలా తీర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన కొడుకు ప్రిన్స్ మళ్ళీ ఆ శివాజీ గెటప్ లో కనిపిస్తే? ఎలా ఉంటుందీ, దానికి రాజమౌళి దర్శకుడైతే???

సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ

అబ్బో ఈ ఆలోచన అదిరిపోతుంది కదా. సీనియర్ ఎన్.టి.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ శివాజి చరిత్రతో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. వారు చేయకున్నా శివాజి కథ మహేష్ తో చేస్తే అదిరిపోద్దని అంటున్నాడు పరుచూరి సోదరులలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ.

Prabhas "Chatrapathi" Movie Releasing Tomorrow As "Chandramouli"
 మహేష్ హీరోగా

మహేష్ హీరోగా "శివాజి"

ఈమధ్యనే పరుచూరి పలుకులు అంటూ ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన ఆయన సినిమా పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్స్ మీద మాట్లాడుతున్నారు. ఇక మహేష్ హీరోగా శివాజిగా చూపించే సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్.టి.ఆర్, కృష్ణ చేయలేని ఆ ప్రాజెక్ట్ మహేష్ చేస్తే బాగుంటుందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

 కోరుకున్నప్పటికీ నటించలేని పాత్ర

కోరుకున్నప్పటికీ నటించలేని పాత్ర

"అల్లూరి సీతారామరాజు" గా సూపర్ స్టార్ కృష్ణ నటించేశారు. కానీ, కృష్ణగారు కోరుకున్నప్పటికీ నటించలేని పాత్ర ఒకటి అలానే మిగిలిపోయింది. అది ‘ఛత్రపతి శివాజీ'. శివాజీ గెటప్ కు కృష్ణ గారు ఎంత బాగా సరిపోతారో, మహేష్ కూడా అంతే బాగుంటాడు. ఈ పాత్రలో నటిస్తే జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి పేరు వచ్చే అవకాశాలున్నాయి. ఆ పాత్రలో మహేశ్ బాబు నటించాలని నేను కోరుతున్నా..మీరు కూడా కోరండి" అని ప్రేక్షకులను ఉద్దేశించి గోపాలకృష్ణ అన్నారు.

ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాడట

ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాడట

ఇక ఎన్నాళ్లనుండో మహేష్ తో రాజమౌళి సినిమా ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కె.ఎల్.నారాయణ ఈ ఇద్దరి కాంబోకి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాడట. మరి రాజమౌళి కాస్త టైం తీసుకుని అయినా సరే పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్టుగా ఛత్రపతి శివాజి మహేష్ తో చేస్తాడేమో చూడాలి.

భరత్ అను నేను

భరత్ అను నేను

ప్రస్తుతం మహేష్ "భరత్ అను నేను" సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతైనా రాజమౌళి, పరుచూరి పలుకులని పట్టించుకుంటాడేమో చూడాలి మరి. ఒక వేళ అలాంతి ప్రయత్నం గనక జరిగితే మహేష్ ఛత్రపతి శివాజీ గా ఎలా కనిపిస్తాడో చెప్పక్కర్లేదు కదా...

English summary
After directing Prabhas, Junior NTR, Ram Charan and Nani, it would be the first time Rajamouli will be working with Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu