»   » తేజ కామెంట్స్ వివాదం: మహేష్ బాబు స్పందించారు!

తేజ కామెంట్స్ వివాదం: మహేష్ బాబు స్పందించారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘శ్రీమంతుడు' సినిమా ద్వారా మహేష్ బాబు ఒక మంచి మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లారు. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు... తమ సొంతూర్లను, వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరుచాలనే కాన్సెప్టును సినిమాలో చూపించడంతో పాటు, పలు గ్రామాలను స్వయంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా చూసి ఇన్ స్పైర్ అయి పలువురు ప్రేక్షకులు, ఇతర స్టార్స్ కూడా గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అయితే దర్శకుడు తేజ మాత్రం మహేష్ బాబు చేస్తున్న ఈ పనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మహేష్ బాబు ఇన్ కం టాక్స్ తగ్గించుకోవడానికే గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు, దేశాన్ని ఏదో ఉద్దరించడానికి కాదు, ఆయనకు అలాంటి ఉద్దేశ్యం ఉంటే శ్రీమంతుడు సినిమా వరకు ఆగే వాడు కాదు, ఒక్కడు సినిమా సమయంలోనే చేసే వాడు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మహేష్ బాబు అభిమానులు తేజ మీద భగ్గుమన్నారు.

Mahesh Babu responds on Teja comments

కాగా... ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో తేజ వ్యాఖ్య‌ల‌పై మ‌హేష్ బాబు స్పందించారు. తేజ చేసిన వ్యాఖ్య‌లును ప‌ట్టించుకోన‌ని, ఆయ‌న ఏ ఉద్దేశ్యంతో అలా అన్నారో త‌న‌కు తెలియ‌దని అన్నారు.

ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మహేష్ బాబు తన ప్రత్యేకతను చాటుకున్నారు. మొదటి నుండి వివాదాలకు దూరంగా ఉండటమే మహేష్ బాబుకు అలవాటు. గతంలో సమంత 1-నేనొక్కడినే పోస్టర్ విషయంలో వివాదానికి తెర తీసింది. మహేష్ బాబు అభిమానులు సమంత తీరుపై మండి పడ్డా...మహేష్ బాబు మాత్రం లైట్ తీసుకున్నారు.

English summary
"I do not care" Mahesh babu responds over Director Teja comments.
Please Wait while comments are loading...