»   » మహేష్ ‘1’-ఫస్ట్ డే హైదరాబాద్లో 685 షోలు

మహేష్ ‘1’-ఫస్ట్ డే హైదరాబాద్లో 685 షోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '1-నేనొక్కడినే' ఈ నెల 10న సక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఈచిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో తొలి రోజు ఏకంగా.....110కి పైగా థియేటర్లు, మల్టీ ప్లెక్సులు కలిసి మొత్తం 685 షోలు ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో మరోసారి రుజువైంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విడుదలైన మహేష్ బాబు తాజా సినిమా '1-నేనొక్కడినే' థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 1 రోజులోనే 5 లక్షల హిట్స్ సొంతం చేస్తుంది. ప్రస్తుతం ఈ కౌంట్ 8 లక్షలు క్రాస్ అయింది.

ట్రైలర్ పరిశీలిస్తే...హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. జేమ్స్ బాండ్ సినిమాల మీదిరి ఈచిత్రంలో హై యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు చూడబోతున్నామని తెలుస్తోంది. రొటీన్ సినిమాల్లా కాకుండా డిఫరెంటు లొకేషన్లలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. బైక్, కార్ చేజింగులు, గన్ షాట్స్.....సస్పెన్స్‌తో కూడిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టి పడేస్తుందని అవగతం అవుతోంది.

ఈ సినిమా తన కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ఇందులో మహేష్ గూడచారి పాత్రలో నటిస్తున్నాడు. క్రితి సానన్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నాజర్, అను హుస్సేన్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, విక్రమ్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ డైలాగులు, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ కానున్నాయి.

ఈ చిత్రం విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తర్వాత హిట్ టాక్ వస్తే రూ. 100 కోట్లు వసూలు కావడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు సినిమాలకు కేవలం యూత్ లోనే కాదు, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఎక్కువ. సుకుమార్ దర్శకత్వం వహించడం అనే అంశం మరింత ప్లస్. మహేష్ బాబుతో గతంలో దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ బాలనటుడిగా తెరంగ్రేటం చేయబోతున్నారు.

English summary
Mahesh Babu's '1-Nenokkadine' producers planing 1st day 685 shows in Hyd. The latest theatrical trailer of ’1′-Nenokkadine has got a superb response on Youtube. The trailer has received almost 5 lakh views within 24 hours and this is a new record for a Telugu film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu