»   » భారీ కటౌట్లు: సర్వత్రా మహేష్ బాబు ఫీవర్ (ఫోటోలు)

భారీ కటౌట్లు: సర్వత్రా మహేష్ బాబు ఫీవర్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం రేపు(జనవరి 10)న గ్రాండ్‌గా విడుదల అవుతున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మహేష్ బాబు ఫీవర్ నెలకొంది. భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికే ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు టీవీ, పేపర్, రేడియో, ఇంటర్నెట్ తదితర మాధ్యమాల్లో మార్మోగి పోతున్నాయి.

ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఈచిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. U/A సర్టిఫికెట్ జారీ కావడం ద్వారా ఈచిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చని స్పష్టమవుతోంది. స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు....

భారీ విడుదల

భారీ విడుదల


ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1250 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టోటల్ ప్రపంచ వ్యాప్తంగా 1500 థియేటర్లలో సినిమా విడుదల అవుతోందని నిర్మాతలు తెలిపారు.

గౌతం తెరంగ్రేటం

గౌతం తెరంగ్రేటం


నిర్మాతలు మాట్లాడుతూ...తమ సినిమా ద్వారా మహేష్ బాబు తనయుడు గౌటం తెరకు పరిచయం అవుతుండటం సంతోషంగా ఉందని, గౌతం చాలా బాగా నటించాడు. డబ్బింగ్ కూడా సింగిల్ టేక్ లో పూర్తి చేసాడు అని తెలిపారు.

సంతృప్తిని ఇచ్చే సినిమా

సంతృప్తిని ఇచ్చే సినిమా


ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిగా బయటకు వస్తాడు అని తెలిపారు.

షూటింగ్ వివరాలు

షూటింగ్ వివరాలు


సినిమా షూటింగ్ మొత్తం 170 రోజుల పాటు జరిగిందని, అందులో 60 రోజుల పాటు లండన్లో చిత్రీకరణ జరిపామని తెలిపారు. లండన్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా తర్వాత వన్ సినిమా కోసం ఒక బ్రిడ్జిని బ్లాక్ చేసి షూటింగ్ చేసామని నిర్మాతలు తెలిపారు.

ఈరోస్

ఈరోస్


ఈరోస్ సంస్థ వారికి సినిమా కథ బాగా నచ్చడంతో తమతో టై అప్ అయ్యారని చెప్పుకొచ్చారు. త్వరలో సినిమాను జర్మనీ, ఫ్రాన్స్ బాషల్లోనూ డబ్ చేసి విడుదల చేస్తామన్నారు నిర్మాతలు.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..


తొలి రోజు ఈచిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో తొలి రోజు ఏకంగా.....110కి పైగా థియేటర్లు, మల్టీ ప్లెక్సులు కలిసి మొత్తం 685 షోలు ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.

హాలీవుడ్ రేంజిలో..

హాలీవుడ్ రేంజిలో..


ట్రైలర్ పరిశీలిస్తే...హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. జేమ్స్ బాండ్ సినిమాల మీదిరి ఈచిత్రంలో హై యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు చూడబోతున్నామని తెలుస్తోంది. రొటీన్ సినిమాల్లా కాకుండా డిఫరెంటు లొకేషన్లలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. బైక్, కార్ చేజింగులు, గన్ షాట్స్.....సస్పెన్స్‌తో కూడిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టి పడేస్తుందని అవగతం అవుతోంది.

హైలెట్స్ ఏంటి

హైలెట్స్ ఏంటి


ఈ సినిమా తన కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ఇందులో మహేష్ గూడచారి పాత్రలో నటిస్తున్నాడు. క్రితి సానన్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నాజర్, అను హుస్సేన్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, విక్రమ్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ డైలాగులు, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ కానున్నాయి.

100 కోట్లు టార్గెట్

100 కోట్లు టార్గెట్


ఈ చిత్రం విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తర్వాత హిట్ టాక్ వస్తే రూ. 100 కోట్లు వసూలు కావడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

English summary

 Mahesh Babu's 1 Nenokkadine to open in 1500+ screens worldwide. The movie is now all set for January 10th grand scale release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu