»   » మహేష్‌ '1'... నేనొక్కడినే షెడ్యూల్ డిటేల్స్

మహేష్‌ '1'... నేనొక్కడినే షెడ్యూల్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం '1'. నేనొక్కడినే అనేది ట్యాగ్ లైన్. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. 14రీల్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది.

నిర్మాత మాట్లాడుతూ...''యాక్షన్‌ తరహాలోసాగే వైవిధ్యమైన కథాంశంతో సినిమా రూపొందుతోంది. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 16 వరకు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. 26 నుంచి బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరపతున్నాం'' అని అన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. గౌతమ్‌ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుంది.

డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి...వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడు.

మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాజి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh Babu's 1 shooting schedules are being canned in and around Hyderabad. Vital scenes are being canned in and around Banjara Hills area and the film will introduce Kriti Sanon as the female lead. Sukumar is planning to wrap up the film shoot by October month as Mahesh Babu will begin working for Aagadu film. Recently, the makers have wrapped London schedule shoot for 45 days.After the Hyderabad schedule, 1 unit members will fly to Bangkok for last schedule. 1 film being produced by 14 Reels Entertainment banner by Anil Sunkara, Ram Achanta and Gopichand Achanta will release for Sankranthi (Pongal) 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X