»   » ‘బ్రహ్మోత్సవం’ అంటే అదే, రిలీజ్ డేట్‌పై మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ

‘బ్రహ్మోత్సవం’ అంటే అదే, రిలీజ్ డేట్‌పై మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పి.వి.పి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్.వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టెనర్ ‘బ్రహ్మోత్సవం'. సినీ జీవిత స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31 సందర్భంగా ఈ చిత్రం ప్రారంభోత్సవం పి.వి.పి సంస్థ కార్యాలయంలో ఉదయం గం.9.27ని. జరిగింది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి క్లాప్ ఇచ్చి, కెమెరా స్విచాన్ చేసారు.

అదే బ్రహ్మోత్సవం...
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ..‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో మరో మంచి సినిమా చేస్తున్నాము. పి.వి.పి సినిమా వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడైనా నలుగురు ఉన్న చోట ఓ అందం, ఆనందం ఉంటుంది. అలాంటిది అనేక మంది ఒక కుటుంబంలో ఉండి ప్రతి ఓ సందర్భాన్ని ఓ ఉత్సవం జరుపుకునేటట్టు ఉంటే అదే ‘బ్రహ్మోత్సవం' అన్నారు.

 Mahesh Babu's Brahmotsavam launched

సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల
పి.వి.పి అధినేత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ..‘జులై 10 నుండి ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. మా పి.వి.పి సంస్థలో ఇది ఓ ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తాం. ప్రేక్షకుల్లో అభిమానుల్లో జనవరి 8 నుండే ఈ చిత్రం పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. శ్రీకాంత్ అడ్డాల రెడీ చేసిన అద్భుతమైన స్క్రిప్టు ని ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం' అన్నారు.

మహేష్ బాబు, సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, తనికెళ్ల భరణిలతో పాటు భారీ తారాగణం ఇతర ముఖ్య పాత్రలు పోషించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జే.మేయర్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, ఆర్ట్: తోటతరణి, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

English summary
Muhuart of Mahesh Babu’s 22nd film ‘Brahmotsavam’ was held at PVP office at 9:27 am on 31 May. Regular shooting will start from 10 July and the producer PVP is aiming to release this movie on 8 January 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu