»   » కవర్ పేజీ కోసం మహేష్ ఫొటో షూట్(ఫొటో)

కవర్ పేజీ కోసం మహేష్ ఫొటో షూట్(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు మరోసారి ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఎక్కనున్నారు. ఈ మేరకు ఫొటో షూట్ జరిగింది. లీడింగ్ సెలబ్రెటీ ఫొటో గ్రాఫర్ కార్తీక్ శ్రీనివాసన్ రీసెంట్ గా ఫొటో షూట్ చేసారు. ఈ ఫొటోని ఇక్కడ మీరు చూడవచ్చు.

ఇప్పటివరకూ మహేష్ నాలుగు సార్లు...ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డుని పొందారు. ఈ సారి ఆయనకు అవార్డు వచ్చినట్లు తెలుస్తోంది ఈ ఫొటో షూట్ ని బట్టి. మహేష్ లాస్ట్ ఇయిర్ చేసిన 1,నేనొక్కిడినే చిత్రంలో ఆయన నటనకు గానూ ఈ అవార్డుని పొందినట్లు సమాచారం.

ఇక మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడు విషయానికి వస్తే...

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పొల్చాచ్చి లో జరుగుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఉగాది రోజు అంటే మార్చి 21 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి ‘జమిందార్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.

Mahesh Babu's Filmfare Photo Shoot!

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.

మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Mahesh Babu is all set to feature on the cover of Filmfare magazine yet again.
Please Wait while comments are loading...