»   » మహేష్ బాబు హీరోయిన్లు.. (ఫోటో ఫీచర్)

మహేష్ బాబు హీరోయిన్లు.. (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయనతో సినిమా చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే అని...చాలా మంది తారలు ఆయనతో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మహేష్ బాబు 18 సినిమాల్లో నటించారు. 17 మంది ముద్దు గుమ్మలకు ఆయన సరసన నటించే ఛాన్స్ దక్కింది.

మహేష్ బాబు బాల నటుడిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ తెరంగ్రేటం చేసిన చిత్రం మాత్రం 1999లో వచ్చిన 'రాజకుమారుడు'. మహేష్ బాబు సరసన నటించిన మొదటి హీరోయి బాలీవుడ్ భామ ప్రీతి జింతా. ఆ తర్వాత ఆయన సిమ్రాన్, సోనాలి బింద్రే, నమ్రతా శిరోద్కర్, బిపాసా బసు, లిసా రే, ఆర్తి అగర్వాల్, భూమిక, అమీషా పటేల్, రక్షిత, శ్రీయ, త్రిష, ఇలియానా, అమృతరావు, అనుష్క, సమంత, కాజల్‌లతో జోడీ కట్టారు.

మహేష్ బాబు తొలి నాళ్లలో తన సినిమాలన్నింటిలో దాదాపుగా బాలీవుడ్ ముద్దుగుమ్మలతోనే రొమాన్స్ చేసాడు. 2003లో వచ్చిన 'ఒక్కడు' సినిమాలో భూమికతో చేసిన తర్వాత ఆయన సినిమాల్లో బాలీవుడ్ భామలు తగ్గుతూ వచ్చారు. అప్పటి నుంచి సౌత్ హీరోయిన్లతో చేయడం ప్రారంభించాడు.

2000 సంవత్సరంలో వచ్చిన 'వంశీ' చిత్రంలో నమ్రత శిరోద్కర్‌తో నటించిన మహేష్ బాబు...ఆ సినిమా సమయంలోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. వీరి మధ్య దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయనం సాగింది. 2005లో వీరిద్దరు కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు.


మహేష్ బాబు తొలి హీరోయిన్ ప్రీతి జింతా. మహేష్ హీరోగా రూపొందిన తొలి మూవీ ‘రాజకుమారుడు'లో వీరు కలిసి నటించారు. ఈ చిత్రంలో వీరి జోడీకి మంచి పేరొచ్చింది.


మహేష్ బాబుతో కలిసి ‘యువరాజు' చిత్రంలో నటించిన సిమ్రాన్....ఈ చిత్రంలో మహేష్ కంటే పెద్దగా కనిపించినట్లు విమర్శలు వచ్చాయి. అయితే ఈ మూవీ ఫ్యాష్ బ్యాక్ లో మాత్రం బాగా కనిపించారు.


మహేష్ బాబు, నమ్రత తొలిసారి ‘వంశీ' చిత్రం షూటింగులో కలుసుకున్నారు. వీరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది.


మహేష్ బాబు కెరీర్లో ‘మురారి' చిత్రాన్ని బెంచ్ మార్క్ సినిమా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో మహేష్ బాబుతో జతకట్టిన సోనాలి బింద్రే మహేష్ బాబుకు తగిన జోడీగా పేరు తెచ్చుకుంది.


బాబీ చిత్రంలో మహేష్ బాబు-ఆర్తి అగర్వాల్ కలిసి నటించారు.


మహేష్ బాబు తండ్రి కృష్ణ కౌబాయ్ సినిమాలకు పెట్టింది పేరు. తండ్రిని అనుసరిస్తూ మహేష్ చేసిన తొలి కౌబాయ్ మూవీ ‘టక్కరి దొంగ'. ఈ చిత్రంలో తొలిసారిగా ఇద్దరు భామలు బిపాసా బసు, లిసా రేలతోకలిసి నటించారు మహేష్ బాబు.


మహేష్ బాబు-భూమిక జంటగా నటించిన ‘ఒక్కడు' చిత్రం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో వీరి జోడీకి మంచి పేరొచ్చింది.


మహేష్ బాబు చేసిన డిపరెంట్ చిత్రాల్లో నాని ఒకటి. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన అమీషా పటేల్ నటించింది.


తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నిజం' చిత్రంలో మహేష్ బాబు, రక్షిత కలిసి నటించారు.


మహేష్ బాబు-శ్రీయ కాంబినేషన్లో వచ్చిన చిత్రం అర్జున్. ఈ చిత్రంలో వీరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది.


మహేష్ బాబు-త్రిష కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి సైనికుడు, మరొకటి అతడు


మహేష్ బాబు, ఇలియానా కలిసి నటించిన ‘పోకిరి' చిత్రం తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి భారీ విజయం సాధించింది.


మహేష్ బాబు, అమృత రావు కలిసి నటించిన చిత్రం ‘అతిథి'. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది.


మహేష్ బాబు-అనుష్క కాంబినేషన్లో వచ్చిన ‘ఖలేజా' చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.


మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన బిజినెస్ మేన్ చిత్రం 2012లో విడుదలైంది.


మహేష్ బాబు, సమంత కలిసి ఇప్పటి వరకు రెండు చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి ‘దూకుడు' కాగా, మరొకటి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించాయి.

English summary
Mahesh Babu, the prince of Telugu Film Industry, is considered the best looking actor in recent times. He has acted in 18 movies so far along side 17 lucky actresses. Mahesh Babu, who started his film career as a child artist, acted in his first movie as the lead actor in Raja Kumarudu (1999).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu