twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ యూఎస్ఏ ప్రీమియర్ షో: ఇప్పటి వరకు వసూలైన మొత్తం ఇదే!

    |

    Recommended Video

    Maharshi Movie Premiere Shows Collection Report || Filmibeat Telugu

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలోనే సెకండ్ బిగ్గెస్ట్‌గా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా మహేష్ బాబు సినిమాలకు భారీ డిమాండ్ ఉండటంతో రికార్డ్ స్థాయిలో రిలీజ్ చేశారు.

    బాహుబలి రికార్డును సైతం బద్దలు కొడుతూ 'మహర్షి' చిత్రాన్ని యూఎస్ఏతో పాటు ఇతర ఓవర్సీస్ లొకేషన్లలో 2500లకు పైగా ప్రీమియర్ షోలు వేశారు. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్ కలెక్షన్స్ టాప్ లేచిపోవడం ఖాయంగా అనే అంచనాలు ఏర్పడ్డాయి.

    2 మిలియన్ డాలర్ టార్గెట్

    2 మిలియన్ డాలర్ టార్గెట్

    ‘మహర్షి' ప్రీమియర్ షోలు డిమాండుకు తగిన విధంగా అత్యధిక సంఖ్యలో వేశారు. ఈ షోల ద్వారా 2 మిలియన్ డాలర్ వసూలు చేయడమే లక్ష్యంగా రిలీజ్ ఏర్పాట్లు చేశారు. ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావడంతో టికెట్స్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

    టాలీవుడ్లో టాప్ రికార్డ్ అదే..

    టాలీవుడ్లో టాప్ రికార్డ్ అదే..

    ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో టాప్ రికార్డ్ ‘బాహుబలి 2' పేరు మీద ఉంది. 2017లో ఈ చిత్రం విడుదలవ్వగా ప్రీమియర్ షోల ద్వారా 2.4 మిలియన్ డాలర్ వసూలు చేసింది. నాన్ బాహుబలి రికార్డ్స్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి' చిత్రం 1.5 మిలియన్ డాలర్ ప్రీమియర్ షో వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 1 మిలియన్ డాలర్ వసూళ్లతో ‘స్పైడర్' ఉంది.

    మహర్షి మూవీ ఫస్టాఫ్ హైలెట్స్.. ఎమోషనల్‌గా మహేష్ కాలేజీ స్టూడెంట్ ఎపిసోడ్స్మహర్షి మూవీ ఫస్టాఫ్ హైలెట్స్.. ఎమోషనల్‌గా మహేష్ కాలేజీ స్టూడెంట్ ఎపిసోడ్స్

    ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ‘మహర్షి' యూఎస్ఏ ప్రీమియర్ షో వసూళ్లు

    ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ‘మహర్షి' యూఎస్ఏ ప్రీమియర్ షో వసూళ్లు

    ‘మహర్షి' సినిమా ప్రీమియర్ షోల వసూళ్ల వివరాల్లోకి వెళితే... అమెరికా కాలమానం ప్రకారం మే 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 198 లొకేషన్ల నుంచి $413k వసూలైనట్లు సమాచారం. టోటల్ 260 లొకేషన్ల నుంచి వసూళ్ల సమాచారం అందాల్సి ఉంది.

    ఓవర్సీస్ రైట్స్ ఎంతకు అమ్మారు?

    ఓవర్సీస్ రైట్స్ ఎంతకు అమ్మారు?

    మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను' ఓవర్సీస్ మార్కెట్లో లైఫ్ టైమ్ రన్‌లో రూ. 30 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పాటు రూ. 16 కోట్ల షేర్ రాబట్టింది. అయితే అప్పట్లో ఆ సినిమాకు రూ. 18.50 కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో వర్కౌట్ కాలేదని టాక్. ‘మహర్షి' సినిమాను రూ. 18 కోట్లు దిల్ రాజు బేరం పెట్టారని, ఎవరూ అంత భారీ మొత్తం పెట్టడానికి ముందుకు రాక పోవడంతో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ రూ. 14 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Maharshi is gearing up for a big release not only in India but in the overseas regions as well. Mahesh Babu's 25th movie will have its grand premiere shows in the US on May 8, 2019. If reports are to be believed, the advance booking for Maharshi premiere shows has been excellent with the movie having fetched around $106,847 already from the 108 locations in which the film is releasing. Now, it needs to be seen whether Maharshi would go on to set a new record in terms of US premiere shows collections. According to the predictions from the industry trackers, the film is expected to touch the $2M mark from the premiere shows itself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X