»   » ఇపుడు ఇక మహేష్ బాబు సోదరి కూడా...

ఇపుడు ఇక మహేష్ బాబు సోదరి కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తన తాజా సినిమా ‘శ్రీమంతుడు' సినిమా ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సొంత గ్రామాలను, వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలంటూ ఆయన తన సినిమాలో చూపెట్టి, స్వయంగా నిజజీవితంలో కూడా ఆచరిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఆయన అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శ్రీమంతుడు సినిమా చూసి చాలా మంది ఇన్స్ స్పైర్ అవుతున్నారు. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలోని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ మంచి కార్యక్రమం చేపట్టేందుకు ముందడుగు వేస్తున్నారు. మహేష్ బాబు సోదరి పద్మావతి గల్ల కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది.

Mahesh Babu's Sister Padmavathi Galla Adopts A Village

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్ల జయదేవ్ ను పెళ్లాడిన పద్మావతి గుంటూరు జిల్లాలోని తెనాలి పరిధిలోని కంచర్లపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరిచేందుకు ప్లాన్ చేస్తోంది. ఆమె ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందనే విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

మహేష్ బాబు తో పాటు... టాలీవుడ్ స్టార్స్ మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కూడా ఈ గ్రామాలను దత్తత తీసుకోవాలనే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. ప్రకాష్ రాజ్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోగా, మంచు విష్ణు చిత్తూరు జిల్లాలో ఏకంగా పది గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Apart from adopting his native village Burripalem, Mahesh will also adopt a village in Telangana. Joinig the Prince of Ghattamaneni family now, is Mahesh's sister Padmavathi Galla.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu