»   » గణేష్ నిమజ్జనంలో మహేష్ బాబు తనయుడు (ఫోటో)

గణేష్ నిమజ్జనంలో మహేష్ బాబు తనయుడు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నివాసంలో ప్రతిష్టించిన బుల్లి వినాయకుడి నిజమజ్జన వేడుక ముగిసింది. గౌతమ్, అతని స్నేహితులు....మహేష్ బాబు ఇంటి సిబ్బందితో కలిసి దుర్గం చెరువులో నిమజ్జనం చేసారు.

గణేష్ నిమజ్జనం ఫోటోను నమ్రత తన సోషల్ మీడియా పేజీ ద్వారా రిలీజ్ చేసారు. మహేష్ బాబు ఇంట్లో ప్రతి పండగకు సంబంధించిన వేడుకలు జరుగుతాయి. పిల్లలకు మన సాంప్రదాయాలు, పద్దతులు అలవడేలా స్పెషల్ కేర్ తీసుకుంటుంది నమ్రత. సితార, గౌతమ్ లకు సంబంధించిన ప్రతి మూమెంటును ఆమె అభిమానులతో పంచుకుంటుంది.

Mahesh Babu's Son Gautam Immersed Ganesh

గౌతమ్ గురించి ఇతర వివరాల్లోకి వెళితే.... అల్లూరి సీతారామరాజు సినిమాను మహేశ్ కుమారుడు గౌతమ్ ప్రధాన పాత్రగా రీమేక్ చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. రామ్‌గోపాల్ వర్మ, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల వద్ద రైటర్‌గా పనిచేసిన నడిమింటి నరసింహరాజు ఈ చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

స్వేచ్ఛ, స్వాతంత్ర్య ఆలోచనలకు అల్లూరి సీతారామరాజు బాలుడి ఎలా ప్రభావితం అయ్యాడు, విద్యార్థి వయసులు సీతారామరాజు పడిన సంఘర్షణ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధింని నరసింహరాజు ఇప్పటికే తన పరిశోధనను పూర్తి చేసి కథను సిద్ధం చేశారని, ఈ పాత్రకు గౌతమ్ అయితే కరెక్ట్‌గా సరిపోతాడని భావించి కృష్ణ, మహేశ్‌బాబుకు కథను వినిపించారని టాలీవుడ్‌ టాక్.

English summary
Superstar Mahesh Babu’s son Gautam has immersed a Ganesh idol at Durgam Cheruvu in Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu