»   » ‘శ్రీమంతుడు’: యూఎస్ఏలో మూడ్రోజుల్లో 2 మిలియన్ డాలర్స్

‘శ్రీమంతుడు’: యూఎస్ఏలో మూడ్రోజుల్లో 2 మిలియన్ డాలర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ విడుదల రోజే పాజిటివ్ రిపోర్ట్ రావడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో అత్యంత ఎక్కువ మార్కెట్ కలిగిన మహేష్ బాబు ఈ చిత్రంతో యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నారు. ఓపెనింగ్ వీకెండ్ ఈ చిత్రం ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసింది.

ఓవర్సీస్ మార్కెట్లో మహేష్ బాబుకు కలెక్షన్ల కింగ్ అనే పేరుంది. ఇప్పటి వరకు యూఎస్ఏలో టాప్ 10 కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మహేష్ బాబు సినిమాలు 4 ఉండటం గమనార్హం. తన సత్తా ఏమిటో మహేష్ బాబు మరోసారి ‘శ్రీమంతుడు' సినిమాతో నిరూపించాడు.


ఇటీవల విడుదలైన ‘బాహుబలి' సినిమా అన్ని రికార్డులను తుడిచి పెట్టేసింది. ఇకపై ఎవరూ ‘బాహుబలి' రికార్డులను అందుకునే అవకాశమే లేదు అనే రేంజిలో వసూళ్లు సాధించింది. అయితే బాహుబలి రికార్డులను మినహా ఇతర సినిమాల రికార్డులన్నింటికీ అధిగమిస్తూ ‘శ్రీమంతుడు' దూసుకెలుతోంది.


‘బాహుబలి' సినిమా తర్వాత యూఎస్ఏ మార్కెట్లో 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న సినిమా కేవలం ‘శ్రీమంతుడు' మాత్రమే కావడం గమనార్హం. ఇటీవల కాలంలో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల వివరాలు స్లైడ్ షోలో...


శ్రీమంతుడు

శ్రీమంతుడు


మహేష్ బాబు శ్రీమంతుడు కేవలం తొలి వీకెండ్ నాటికే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఓవరాల్ రన్ లో ఎన్ని మిలియన్లు వసూలు చేస్తుందో..?


బాహుబలి

బాహుబలి


బాహుబలి సినిమా ఇప్పటి వరకు 6 మిలియన్ డాలర్లు పైగా వసూలు చేసింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.


సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి


సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఓవరాల్ రన్ లో 1 మిలియన్ మార్కును అందుకుంది.


టెంపర్

టెంపర్


2015లో యూఎస్ఏ మార్కెట్లో 1 మిలియన్ మార్కును అందుకున్న తొలి చిత్రం ‘టెంపర్'


మహేష్ బాబు

మహేష్ బాబు


శ్రీమంతుడు సినిమా కేవలం ఓపెనింగ్స్ కలెక్షన్లతోనే 1 మిలియన్ మార్కను అందుకుంది.


English summary
Srimanthudu has opened to highly positive reports all over and it surely reflected in it's box office collections. The Mahesh Babu starrer has been setting some new records overseas as it has managed to enter 2 million club just after it's opening weekend.
Please Wait while comments are loading...