»   » ‘శ్రీమంతుడు’...ఆడియన్స్ పాజిటివ్, నెగెటివ్ రెస్పాన్స్

‘శ్రీమంతుడు’...ఆడియన్స్ పాజిటివ్, నెగెటివ్ రెస్పాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ ప్రేక్షకులు గత కొంత కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహేష్ బాబు సినిమా ‘శ్రీమంతుడు' నేడు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. తెల్లవారుఝాము నుండే వివిధ ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు... మౌత్ టాక్ కూడా సినిమా బావుందని వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలోని అభిమానులు, సినిమా ప్రేమికులు తెల్లవారుజామన 4 గంటల తర్వాత ప్రారంభమైన బెనిఫిట్ షోలకు హాజరు కాగా, ఓవర్సీస్ మార్కెట్లయి యూఎస్, కెనడా, యూకె తదితర ప్రాంతాల్లో ప్రీమియర్ షోలకు ఫ్యాన్స్ భారీగా సంఖ్యలో హాజరయ్యారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుండే ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలు వెల్లడించడం మొదలు పెట్టారు.


సినిమాపై కొందరు పాజిటివ్ గా స్పందించగా, మరికొందరు నెగెటివ్ గా స్పందించారు. హీరో ఎలివేషన్ సీన్స్, మెయిన్ స్టోరీ సినిమాను పైకి తీసుకెళ్లాయని, అయితే కామెడీ లేక పోవడం కాస్త అసంతృప్తిని ఇచ్చిందని అంటున్నారు. అయితే సినిమా ప్రేక్షకులకు తప్పుకుండా నచ్చుతుందని ఎక్కువ మంది నుండి వినిపిస్తున్న మాట. స్లైడ్ షోలో అభిమానులు, సినీ ప్రేమికుల స్పందన...


ఆడియన్స్ రెస్పాన్స్

మహేష్ బాబు ఖాతాలో మరో హిట్ పడిపోయిందని చెప్పొచ్చు.


ట్వీట్ రివ్యూ

సినిమాపై పలువురు అభిమానులు పాజిటివ్ గా స్పందించారు.


లైవ్ అప్ డేట్స్

సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్స్ బావున్నాయని అంటున్నారు.


నెగెటివ్

అయితే కొంత మంది నుండి కాస్త నెగెటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.


అభిమానులు

సినిమా హిట్ టాక్ రావడంతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


ట్వీట్స్

మహేష్ బాబు జోరు చూస్తుంటే పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


హిట్ సినిమా

సినిమా హిట్ అంటూ పలువురు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
English summary
Srimanthudu has finally hit the screens near to you and is all set to win you hearts. As reported earlier, the film has opened to great reviews and positive word of mouth.
Please Wait while comments are loading...