»   » 2500 పిల్లల కోసం మహేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..??

2500 పిల్లల కోసం మహేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొన్ని రోజులుగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం అభిమానులు గమనించే ఉంటారు. చుట్టూ పిల్లలు.. వారి మధ్య అందంగా నవ్వుతున్న మహేష్.. ఈ ఫొటో అందరికీ భలే నచ్చేసింది. మహేష్ బాబు ట్విట్టర్ హ్యాండిల్లో సైతం ఈ ఫొటో దర్శనమిచ్చింది. ఇప్పుడీ ఫొటోకు సంబంధించిన ఆసక్తికర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా షూటింగులో భాగంగా పిల్లల మధ్య తీసిన ఓ సన్నివేశం సందర్భంగా తీసిన ఫొటో అది.

Mahesh Babu's Surprise Diwali gifts to 2500 Bhashyam School Kids

ఆ సన్నివేశంలో షూటింగ్‌లో భాష్యం స్కూల్‌కి చెందిన 2,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న పిల్లలంటే అమితంగా ఇష్టపడే సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎంతో ఎంజాయ్‌ చేస్తూ వారితో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్‌లో పాల్గొన్న 2,500 మంది పిల్లలకు చాక్లెట్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌తో కూడిన బాక్స్‌లను దీపావళి రోజున పంపించారు సూపర్‌స్టార్‌ మహేష్‌. పిల్లలందరూ మహేష్‌తో దిగిన ఫోటోను ఆ బాక్స్‌పై ప్రింట్‌ చేశారు.

Mahesh Babu's Surprise Diwali gifts to 2500 Bhashyam School Kids
Mahesh Babu's Surprise Diwali gifts to 2500 Bhashyam School Kids

అలాగే షూటింగ్‌లో పాల్గొన్న పిల్లలందరికీ థాంక్స్‌ చెప్తూ మహేష్‌ స్వయంగా సంతకం చేసిన థాంక్స్‌ కార్డ్‌ కూడా ఉంది. 'నా వర్క్ ప్లేస్ లో సరదాగా ఉంటూ, నవ్వులు కురిపించిన నా చిన్నారి మిత్రులందరికీ ధన్యవాదాలు!! ఆల్వేస్ కీప్ షైనింగ్.... ప్రేమతో, మహేష్ బాబు' అంటూ మహేశ్ సంతకం చేసిన కార్డు బాక్స్ తెరవగానే కనపడుతుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌తో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని, ఆయన తమకు దీపావళి గిఫ్ట్‌లు ఇవ్వడం మరింత ఆనందాన్ని కలిగించిందని పిల్లలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

English summary
Mahesh surprised school children by distributing special Diwali gifts for all the children who participated in the shoot. The snap of Mahesh with the school children has been printed on the special gift box. This left all the students amazed after they received special Diwali gift from Superstar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu