»   » మహేష్ బాబు అంత దిగజారలేదు.. అయినా ఇవేం ప్రచారాలు ?

మహేష్ బాబు అంత దిగజారలేదు.. అయినా ఇవేం ప్రచారాలు ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని రూమర్ లు ఎలా వస్తాయో ఏమోకానీ విచిత్రంగానే అని పిస్తాయి. కొన్ని కాస్త నిజమేనేమో అనిపించేలా ఉంటే మరికొన్ని మాత్రం మరీ కామెడీ అనిపిస్తాయి కానీ ఇలాంటి రూమర్లు కూడా ఒక్కోసారి హాట్ టాపిక్ గా మారుతూంటాయి. ఇప్పుడు అలాంటిదే టాలీవుడ్ లో ఒక గాసిప్ ప్రచారం లో ఉంది అదేమిటంటే సచిన్ బయో పిక్ కోసం మహేష్ డబ్బు తీసుకొని ఆ సినిమా ప్రచారం కోసం ట్వీట్ చేసాడనే మాట... ఇంతకీ ఏమైందీ అంటే...

మహేష్ బాబు ట్వీట్ చెయ్యటం

మహేష్ బాబు ట్వీట్ చెయ్యటం

"లెజెండ్.. సూపర్ హీరో.. మాస్టర్ బ్లాస్టర్.. ఇలా ఎన్నో పేర్లున్న ఒక్కక మనిషి.. సచిన్.. ఎ బిలియన్ డ్రీమ్స్. ఈ సినిమా కోసం వెయిట్ చేయలేకుండా ఉండలేకపోతున్నా. ఆల్ ద బెస్ట్ సచిన్" అంటూ ప్రిన్స్ ట్వీట్ ట్వీట్ చేసాడన్న సంగతి తెలిసిందే కదా. మామూలుగా తన సినిమా కోసం కూడా పర్సనల్ గా ప్రచారం చేయని మహేష్ బాబు ఇలా ట్వీట్ చెయ్యటం కాస్త ఆశ్చర్యం అనిపించింది జనాలకి.

ప్రమోషనల్ వర్క్

ప్రమోషనల్ వర్క్

అయితే మామూలుగా మాట్లాడే సందర్భాలలోనూ మహేష్ తాను సచిన్ కి వీరాభిమానిని అని చెప్పిన సంఘటనలున్నాయి. అయితే కొందరు మాత్రం ఇదంతా సినిమా కోసం సాగుతున్న ప్రమోషనల్ వర్క్ అన్న ప్రచారం మొదలు పెట్టారు. సచిన్ సినిమాకు హైప్ క్రియేట్ చేయటం కోసమే ఈ తరహా ట్వీట్ ప్రచారానికి తెర తీశారని.. ఇందులో భాగంగా మహేష్ కి భారీగా డబ్బులు అందాయి అంటూ వింత ప్రచారం మొదలయ్యింది.

అవసరం ఉందా?

అవసరం ఉందా?

నిజానికి క్రికెట్ గాడ్ గా ప్రపంచం మొత్తం మీద సచిన్ కున్న ఇమేజ్ కు.. మహేశ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? అన్నది పెద్ద ప్రశ్న. అంతే కాదు అంతకు మించి.. సచిన్ అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు తన ఇంటర్వ్యూలలో మహేశ్ ప్రస్తావించటాన్ని మర్చిపోలేం,

అభిమానం ఉంది కాబట్టే

అభిమానం ఉంది కాబట్టే

ఆ అభిమానం ఉంది కాబట్టే మహేష్ ఆ సినిమా విషయం లో కొంత ఆసక్తి గా ఉండొచ్చుకూడా. అన్నిటికంటే అసలు విషయం ఏమిటంటే మహేష్ ఎంత ట్వీట్ చేసినందుకు డబ్బులు తీసుకున్నా అది కోట్లలో మాత్రం ఉండదు. ఒక సినిమా ప్రచారం కోసం కొన్ని లక్షలు తీసుకుంటాడు అన్న మాటే నవ్వొచ్చేలా ఉంది. మరి ఈ తరహా ప్రచారం ఎందుకు మొదలయ్యిందన్నదే ఎవరికీ అర్థం కాని విషయం.

English summary
Most recently, the popular actor posted a tweet on his microblogging account stating... But Now the Tweet turned to a controversy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu