రాత్రి, పగలనే తేడా లేకుండా చెమటోడ్చుతున్న మహేష్ బాబు టీమ్.. ఆ విషయంలో జెట్ స్పీడ్!

గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మహేష్ బాబు అనంతరం వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ వలన ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట విషయంలో సూపర్ స్టార్ సరికొత్త ప్లాన్ తో వెళుతున్నట్లు సమాచారం. డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త స్టైల్ తో కనిపించనున్నాడు.

వీలైనంత తొందరగా పూర్తి చేయాలని

వీలైనంత తొందరగా పూర్తి చేయాలని

మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అనుకుంటాడు. దర్శక నిర్మాతల నుంచి సపోర్ట్ దక్కితే సమయాన్ని సైతం లెక్క చేయడు. ఒక సినిమా పూర్తయ్యే వరకు మరొక సినిమాను టచ్ చేయని ప్రిన్స్ సర్కారు వారి పాట ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

పగలు, రాత్రి అని తేడా లేకుండా

పగలు, రాత్రి అని తేడా లేకుండా

ఇక దర్శకుడు పరశురామ్ కూడా మహేష్ స్పీడ్ ను గట్టిగానే యూజ్ చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పగలు, రాత్రి అని తేడా లేకుండా చెమటోడ్చుతున్నారట. అర్ధరాత్రి షూటింగ్ అంటే బడ్జెట్ విషయంలో చాలా మార్పులు వస్తాయి. ఒక ఆర్టిస్ట్ కు డబుల్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఆ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదట.

రిలీజ్ ఎప్పుడంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

సీనియర్ నటీనటులకు కూడా వారి వాల్యూకి తగ్గట్లుగానే పారితోషికం ఇస్తున్నారట. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి వంటి వారి మధ్యలో కామెడీ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి షూటింగ్ ఆలస్యం అయితే వచ్చే సమ్మర్ కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అభిమానులు చొక్కా చించుకునేలా

అభిమానులు చొక్కా చించుకునేలా

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ , కీర్తి మధ్యలో ఉండే రొమాంటిక్ కామెడీ సీన్స్ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తాయట. మంచి సోషల్ మెస్సేజ్ తో పాటు అభిమానులు చొక్కా చించుకునేలా మాస్ ఎలివేషన్స్ ఉంటాయని దర్శకుడు పరశురామ్ ఇటీవల ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి దర్శకుడి మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X