twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీమంతుడు సైకిల్‌ కాంటెస్ట్‌' : మహేష్‌ డ్రా తీసేది అప్పుడే

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది.

    ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'మా మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో రూపొందిన తొలి చిత్రం 'శ్రీమంతుడు' ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు సాధించడమే కాకుండా 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్‌ రన్‌ అవుతోంది.

    Mahesh Babu to select Cycle winner on 14th November.

    ఈ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేలాదిగా ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. నవంబర్‌ 13తో ఈ కాంటెస్ట్‌ ముగుస్తుంది. నవంబర్‌ 14న సూపర్‌స్టార్‌ మహేష్‌ డ్రా తీసి ఈ కాంటెస్ట్‌లో విజేతను ఎంపిక చేయబోతున్నారు. డ్రాలో గెలుపొందిన విజేతకు నవంబర్‌ 16న సూపర్‌స్టార్‌ మహేష్‌ చేతులమీదుగా సైకిల్‌ను అందజేయడం జరుగుతుంది' అని అన్నారు.

    మహేష్‌ మాట్లాడుతూ ''దర్శకుడు కథ చెప్పగానే ఒక మంచి సినిమా చేయబోతున్నాననే నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసింది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి 'శ్రీమంతుడు' ఒక స్ఫూర్తినిచ్చింది'' అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Srimanthudu completes its 100 days run on 14th November. On this special occasion, Mahesh Babu will be announcing the winner of the Bicycle Contest of Srimanthudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X