For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ బాబు నాకు మెసేజ్ పెట్టాడు

  By Srikanya
  |

  హైదరాబాద్ : నేను ఆయనని కలవలేదు...ఫోన్ లో మాట్లాడలేదు కానీ ఆయన నాకు పర్శనల్ గా మెసేజ్ పెట్టారు... ఆయన చాలా కూల్...ఫ్రెండ్లీ నాచుర్, ఆయన తన విషెష్ ని నాకు తెలియచేసారు ...ఆయన నేను ఒక్కడు రీమేక్ చేయటం గుడ్ ఛాయిస్ అని మెచ్చుకున్నారు. నేను నా చిత్రం ఫస్ట్ పోస్టర్స్ ని ఆయనతో షేర్ చేసుకున్నాను. అలాగే...నా చిత్రం ట్రైలర్ లు చూసారు. ఆయనకు అవి బాగా నచ్చాయి అంటున్నారు అర్జున్ కపూర్. అర్జున్ కపూర్ ప్రస్తుతం ఒక్కడు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  https://www.facebook.com/TeluguFilmibeat

  చిత్రం గురించి....

  మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలించిన 'ఒక్కడు' చిత్రం హిందీలోకి తేవర్ టైటిల్ తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా, మనోజ్ బాజపేయి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తోంది. తెలుగులో లాగానే హిందీలోనూ ఘన విజయం సాదిస్తుందని టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో అంతా ఆనందంగా ఉన్నారు.

  'Mahesh Babu Sent Me Message'

  మహేష్‌ బాబు సూపర్ హిట్‌ 'ఒక్కడు (2003) ని హిందీలో తేవర్ టైటిల్ తో బోనీ కపూర్‌ రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మహేష్‌ బాబు పాత్రను బోనీకపూర్‌ తనయుడు అర్జున్‌ కపూర్‌ పోషిస్తున్నాడు. సంజయ్ కపూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. మొదట అభిషేక్ బచ్చన్ తో ఈ చిత్రం రీమేక్ అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తోంది. ఇక సినిమా రిలీజయ్యక ..మహేష్ ని మరిపిస్తాడా లేదా అనేది ఈ సినిమాకు సంభందించి మరో ఆసక్తికరం అంశం అంటున్నారు.

  ఈ చిత్రంలో మదామియా అంటూ శృతిహాసన్ ఈ రీతిలో అందాలు తెరపై ఒలకపోసింది. ఈ పాట సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా బాలీవుడ్ ఐటం సాంగ్ లలో ఒకటిగా ఉండిపోతుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

  'తేవర్'లో ఆగ్రాకు చెందిన కబడ్డీ ఛాంపియన్ అయిన కాలేజీ కుర్రాడిగా కనిపించనున్నాడు అర్జున్. బోనీ కపూర్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ''అవును. 'ఒక్కడు ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. అర్జున్‌ ప్రధాన పాత్ర పోషించాడు, తమిళ, కన్నడ భాషల్లోకూడా రీమేక్‌ చేసిన ఈ చిత్రం హిందీలో తీయదగ్గ సతా గల చిత్రమని అర్జున్‌ భావిస్తున్నాడు.

  తెలుగు 'ఒక్కడులో మహేష్‌ బాబు సరసన నటించిన భూమిక చావ్లా మాట్లాడుతూ ''ఎన్నో దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్‌ అయ్యాయి. కానీ ఈ చిత్రం రీమేక్‌ అవ్ఞతుండటం ఎంతో ఆనందంగా ఉంది అంది. ఇప్పటికే అర్జున్ కపూర్ 'ఇషక్‌ జాదే' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు పోషించిన పాత్ర అర్జున్‌కు కరెక్ట్ గా సూటవుతుందని, అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఆ సినిమాకు పర్ ఫెక్ట్ గా ఉంటుందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. అర్జున్ కపూర్ ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి సవితి కొడుకు. బోని కపూర్-మోనా పెళ్లయిన పదేళ్ల తర్వాత విడి పోయారు. వీరి సంతానమే అర్జున్ కపూర్.

  అర్జున్‌ కపూర్‌తో 'తేవర్‌' సినిమా కోసం సోనాక్షి జత కట్టింది. ఈ చిత్రానికి అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో వచ్చిన 'ఒక్కడు'కిది రీమేక్‌. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. పిల్లలం. పక్కపక్క ఇళ్లలో పెరిగాం. పుట్టినరోజు వేడుకలు, ఇతరత్రా కార్యక్రమాలకు హాజరయ్యేవాళ్లం. కానీ ఏనాడూ అర్జున్‌ కపూర్‌తో నేను సన్నిహితంగా మెలగలేదు. అతను నాకు సోనమ్‌ కపూర్‌ సోదరుడిగానే తెలుసు'' అని చెప్పుకొచ్చింది హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హా.

  ఈ చిత్రం గురించి సోనాక్షి చెబుతూ ''ప్రతి ఒక్కరికి సంబంధించిన సినిమా ఇది. ముఖ్యంగా యువతరం ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు. ఈ ప్రేమకథలో నేను విభిన్నమైన పాత్రలో కనిపిస్తాను. ఇంతవరకూ నేను పోషించిన పాత్రలన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అర్జున్‌ కపూర్‌ విషయానికొస్తే... ఈ సినిమాతోనే నేను అతనికి బాగా దగ్గరవుతున్నాను. తెలివైనవాడు. బాగా మాట్లాడతాడు. తమాషా చేస్తాడు. అన్నింటికీ మించి అతనిలో మంచి నటుడు ఉన్నాడు. 'తేవర్‌' మా ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను'' అని ముగించింది.

  English summary
  Arjun Kapoor said... 'I haven't watched any of Mahesh's films until the proposal to do Okkadu remake knocked on me four years ago. I've watched the film and was so excited.' 'Although I couldn't meet him personally, I've spoken to him over phone and he was very cool and friendly. He had conveyed good wishes to me and told me that it was good choice to remake Okkadu. I've shared the first posters of film with him and he has recently seen the trailer and sent me a text message. He liked the trailer,' shared Arjun.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X