»   » మహేష్ తో ఫొటో...71 మందిలో నచ్చింది ఈమే

మహేష్ తో ఫొటో...71 మందిలో నచ్చింది ఈమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తో నటించే అవకాసం కోసం ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ సైతం ఆశపడుతూంటారు. అలాంటిది ఓ బెంగాళి భామ ఆసక్తి చూపటంలో వింతేముంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న శ్రీమంతుడు చిత్రం కోసం బెంగాళి భామ..అంగానా రాయ్ ని ఎంపిక చేసారు. హీరోయిన్ గా కాకుండా...ఓ కీలకమైన పాత్ర కోసం ఆమెన తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే ఆమె తమిళ,మళయాళ,కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తన్న ఫొటో...శ్రీమంతుడు సెట్ లో ...అంగనా రాయ్ తో మహేష్ బాబు దిగిందే. అయితే ఆమె పాత్ర ఏమిటన్నది మాత్రం తెలియరాలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక ఈ పాత్ర కీలకమైనది కావటంతో...దర్శకుడు ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. మొత్తం 71 మంది అమ్మాయిలను ఆడిషన్ చేసి మరీ ఎంపిక చేసారట. ఈ విషయాన్ని స్వయంగా అంగనా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలియచేసింది. మహేష్ తో షూటింగ్ చేయటం హ్యాపీగా ఉందని, తను చాలా మంచి వ్యక్తి అని అంది. తనది గ్లామరస్ క్యారక్టర్ అని, అంతకుమించి తన పాత్రను రివిల్ చేయలేనని అంది.


చిత్రం విషయానికి వస్తే...


Mahesh Babu spotted with Angana Roy!

మహేష్‌బాబు హీరోగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఓవర్ సీస్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ ఇండియన్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ వారు మహేష్ బాబు,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఓవర్ సీస్ లోనూ భారీగ ఈ చిత్రం విడుదల కానుంది.


నిర్మాతలు మాట్లాడుతూ...''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు . ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
శ్రీమంతుడు అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఓ ప్లే బోయ్ అని, బోర్న్ రిచ్ అని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సిటీ దాటని వాడు... ఓ గ్రామం ను దత్తత తీసుకుని..అక్కడ పరిస్దితులు చక్కబెడతాడని అంటున్నారు.


ఆ ఊరు పరిస్ధితులు బాగోలేక జనం ఖాళీ చేసి వెళ్లిపోతుంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్ధితుల్లో అక్కడికి ప్రవేసించిన మహేష్... ఆ ఊరుతో అనుబంధం పెంచుకుంటాడని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో అక్క సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని అంటున్నారు. అయితే ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఊహాగానం మాత్రమే. ఎంతవరకూ నిజమో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.


దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Its Angana Roy who will be seen in a key role in Koratala Siva's 'Srimanthudu'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu