»   » స్పైడర్: 8 నిమిషాల సీన్ కోసం రూ. 20 కోట్ల ఖర్చు?

స్పైడర్: 8 నిమిషాల సీన్ కోసం రూ. 20 కోట్ల ఖర్చు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైడర్' మూవీ విషయంలో నిర్మాతలు పెడుతున్న ఖర్చు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ సినిమాలో 8 నిమిషాల సీన్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

'సైడర్' మూవీలో ఓ సీన్లో విలన్ నుండి ప్రజలను కాపాడే సీన్ ఉంటుందని, ఈ సీన్ సినిమా మొత్తానికే మేజర్ హైలెట్ అవుతుందని, చాలా కీలకమైన సీన్ కాబట్టే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.


షూటింగ్ ప్రోగ్రెస్, రిలీజ్ విశేషాలు

షూటింగ్ ప్రోగ్రెస్, రిలీజ్ విశేషాలు

‘స్పైడర్' సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ మీద ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమేనియాలో ఈ సాంగ్ చిత్రీకరించనున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విజయదశమి సందర్భంగా సెప్టెంబరు 27 న ‘స్పైడర్‌'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


Mahesh babu fun at sets with spyder team
భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


ఊహించని స్పందన

ఊహించని స్పందన

మహేష్‌, మురుగదాస్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. ఇటీవల విడుదలైన టీజరకు ఎవరూ ఊహించని విధంగా భారీ స్పందన వచ్చింది. దీన్ని బట్టి సిపిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న 'స్పైడర్‌' చిత్రం సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లోనే ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుందని టీజర్‌ని చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు.


స్పైడర్

స్పైడర్

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.English summary
Producers of 'Spyder' aren't hesitating to spend any amount of money. As much as Rs 20 crore is being spent for a particular sequence lasting for 8 minutes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu