»   » మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ డైలాగులు లీక్

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ డైలాగులు లీక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ‘శ్రీమంతుడు' పేరుతో పిలుస్తున్నారు. త్వరలో అఫీషియల్ టైటిల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. ‘మనుషుల్లో మంచి పోయి క్రూరత్వమే మిగిలింది సార్........ అనే డైలాగుతో పాటు ‘నీకు హెడ్ వెయిట్ ఉంటే...నాకు హ్యాండ్ వెయిట్ ఎక్కువ...చూస్తావా' అనే డైలాగులు లీకైనట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం ఈ చిత్రం మలేసియాలో చిత్రీకరణ జరుగుతోంది. మహేష్‌, శ్రుతి, జగపతిబాబు తదితరులపై ఈనెల 22 వరకూ అక్కడే కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రాన్ని 8.1 కోట్లకు ఓవర్ సీస్ రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. ఈ రేటు ఆల్ టైమ్ రికార్డు ప్రైస్ గా చెప్తున్నారు. నిర్మాత పార్టనర్ నవీన్...ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మహేష్ కు ఓవర్ సీస్ లో పెరిగిన బిజినెస్ దృష్ట్యా ఈ రేటు పలికినట్లు తెలుస్తోంది.


Mahesh Babu Srimanthudu Movie Dialogues Leaked

మహేష్‌బాబు సినిమా అంటేనే ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుంది. కుర్రకారుకి నచ్చే యాక్షన్‌, పెద్దవాళ్లని మెప్పించే భావోద్వేగాలూ, అందరూ ఇష్టపడే వినోదం... ఇలా దేనికీ లోటు చేయరు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే ‘శ్రీమంతుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని అంటున్నారు.


ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఓ ప్లే బోయ్ అని, పుట్టుకతోనే ధనవంతుడు అనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సిటీ దాటని వాడు... ఓ గ్రామం ను దత్తత తీసుకుని..అక్కడ పరిస్దితులు చక్కబెడతాడని అంటున్నారు. ఆ ఊరు పరిస్ధితులు బాగోలేక జనం ఖాళీ చేసి వెళ్లిపోతుంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్ధితుల్లో అక్కడికి ప్రవేసించిన మహేష్... ఆ ఊరుతో అనుబంధం పెంచుకుంటాడని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో అక్క సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని అంటున్నారు. అయితే ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఊహాగానం మాత్రమే. ఎంతవరకూ నిజమో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.


దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Writer turned director Koratala Siva – Superstar Mahesh Babu’s upcoming movie Srimanthudu. Latest update about this movie dialogues are leaked in internet. Now these dialogues are hot topic in Tollywood Film Industry.
Please Wait while comments are loading...