»   » మహేష్ ‘శ్రీమంతుడు’ లొకేషన్ లో...(ఫొటోలు)

మహేష్ ‘శ్రీమంతుడు’ లొకేషన్ లో...(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ భారి సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సంస్థ ‘శ్రీమంతుడు' అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించింది. దాంతో మహేష్ కొత్త సినిమాకు ‘శ్రీమంతుడు' టైటిల్ కన్ఫర్మ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆన్ లైన్ లొకేషన్ ఫొటోలు కొన్ని బయిటకు వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రాజేంద్రప్రసాద్‌, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమానునిర్మిస్తున్నారు.

గతంలో ఈ సినిమాకు టైటిల్ ఖరారయ్యిందంటూ గతంలో పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. వాటిని దర్శకుడు ఖండించారు. తాజాగా ఈ టైటిల్ పై ఇప్పటివరకూ ఏ విధమైన ఖండనా...కొరటాల శివ చేయకపోవటం గమనార్హం. వచ్చే వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చిత్రం ఆన్ లొకేషన్ ఫొటోలు మీ కోసం...

కాంబినేషన్ బాగుంది

కాంబినేషన్ బాగుంది

శృతి హాసన్, మహేష్ ల కాంబినేషన్ ఖచ్చితంగా ప్రేక్షకులకు కిక్ ఇస్తుందంటున్నారు

పూర్తి కసరత్తు

పూర్తి కసరత్తు

కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

కామన్

కామన్

మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది.

నిర్మాతలు మాట్లాడుతూ...

నిర్మాతలు మాట్లాడుతూ...

''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

గతంలో...

గతంలో...

ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎవరెవరు

ఎవరెవరు

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Mahesh babu new film 'Srimanthudu' under Koratala Shiva direction is going at brisk pace . Here is are some on location pics making rounds in social media. Shruti Haasan is the leading lady.
Please Wait while comments are loading...