»   » శ్రీనువైట్లతో చేయనున్న చిత్రం గురించి మహేష్ బాబు

శ్రీనువైట్లతో చేయనున్న చిత్రం గురించి మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీనువైట్ల కాంబినేషన్ లో తాను చేయబోయే చిత్రం గురించి మహేష్ బాబు తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. అందులో ఏం రాసి ఉందంటే...జూన్ నెల నుంచి నేను శ్రీను వైట్ల చిత్రం చేస్తున్నాను. నేను స్క్రిప్టు విషయంలో చాలా తృప్తిగా ఉన్నాను అని రాసారు. ఇక గత కొద్ది రోజులుగా మహేష్ బాబు కంటెన్యూగా ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయం గురించి ట్విట్టర్ లోనే రాస్తూ....నేను ఈ కొత్త అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ రకంగా అభిమానులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు..త్రివిక్రమ్ చిత్రంలో బిజీగా ఉన్నారు. కలేజా టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. అలాగే మహేష్, శ్రీను వైట్ల చిత్రంలో హీరోయిన్ గా సమంత ఎంపికైంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu