»   » పూరి ‘బిజినెస్’ పక్కకు నెట్టి '100% లవ్’ డైరెక్టర్ తో మహేష్...?

పూరి ‘బిజినెస్’ పక్కకు నెట్టి '100% లవ్’ డైరెక్టర్ తో మహేష్...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల వచ్చిన '100% లవ్' సినిమా సాధించిన సక్సెస్ తో దర్శకుడు సుకుమార్ ఒక్కసారిగా మంచి డిమాడ్ లోకి వచ్చేశాడు. యంగ్ హీరోలతో బాటు మిడిల్ ఏజ్డ్ హీరోలు కూడా అతని దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గతంలోనే కమిట్ అయిన మహేష్ బాబు ప్రాజక్టునే సుకుమార్ ముందుగా చేబట్టనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు, మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తాను చేస్తున్న 'దూకుడు' సినిమా పూర్తవగానే మహేష్ బాబు ఈ చిత్రంలోనే నటించనున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే, దర్శకుడిగా సుకుమార్ సక్సెస్ లో వుండడం ప్రాజక్టుకి హెల్ప్ అవుతుందని మహేష్ ఆలోచిస్తున్నాడట. అందుకని పూరీ జగన్నాథ్ రూపొందించే 'బిజినెస్ మేన్' సినిమా కాస్త వెనక్కి వెళ్లి, ఇది ముందుకు వస్తుందని అంటున్నారు.

English summary
After scoring a super hit with the youthful entertainer 100% Love, Creative director Sukumar is gearing up to direct a film with Tollywood’s Prince Mahesh Babu in the lead. While the other details of the project are under wraps, it is learnt that Sukumar has already narrated the story and Mahesh was impressed with it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu