మౌనం వీడిన మహేష్: ప్రచారం చేస్తానని ప్రకటన

By Srikanya

హైదరాబాద్ : మొత్తానికి డైలమా తీరింది. మహేష్ తన బావ గల్లా జయ్ దేవ్ కు ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎందుకు ప్రచారం చేయాలనుకుంటున్నారో కూడా ఆయన క్లారిఫై చేసారు. తాను రాజకీయాలకు ఇప్పటికీ దూరమే అని, అయితే గుంటూరు నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ కోసం తాను రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు.

అలాగే...తన సోదరి పద్మను ఆయన వివాహం చేసుకున్నపుడు నా వయసు 13, అప్పటి నుంచీ ఆయన తనకు రోల్ మోడల్, ప్రేరణ అని అన్నారు. ఆయన నన్ను ఆయన ట్రీట్ చేసే విధానం, తీసుకునే కేర్ తనకు బాగా నచ్చేదని అన్నారు. తర్వాత కాలంలో ఆయన విజన్ ని, దాన్ని విలువతో కూడి నిజం చేసుకోవటం అర్దం చేసుకున్నానని, ఈ రోజు అమర్ రాజా గ్రూప్, అమరన్ బ్రాండ్ అభివృద్దిని చూసానన్నారు. ఆయన తన విజయాలతో మీడియా చేత, పారిశ్రామిక వర్గం చేత గుర్తింపబడ్డారు అన్నారు.

Mahesh Babu supports Jay Galla

ఆయన ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని మాట్లాడేవారు, అయితే ఎందుకనేది నిజంగా నాకు అర్దం కాలేదు, నేను ఎప్పుడూ దాన్ని ఇష్టపడలేదు. రాజకీయాల ద్వారానే రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలనేవారు. అలాగే రాజకీయం ద్వారా చాలా మందికి సేవ చేయవచ్చు అనేవారు. ఆయన ఫేవరెట్ కోట్ ఏమిటంటే... "One man can make a difference, and every man should try."

నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన డిఫెరెన్స్ తేగలరనే నమ్మకం ఉంది. ఆయనకు నా సపోర్టు ఓటు, ఆయన మీకు కూడా నచ్చుతాడనుకుంటున్నాను, గుంటూరు భవిష్యత్ ఆశాజ్యోతిగా ఆయన కాగలరు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ మహేష్ బాబు తన బావ గురించి ట్వీట్ ఇచ్చారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే... మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X