»   » 'బుర్రిపాలెం' ను దత్తత తీసుకుంటున్న మహేష్ బాబు

'బుర్రిపాలెం' ను దత్తత తీసుకుంటున్న మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు త్వరలో తెనాలి మండలం ..గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామం ను దత్తత తీసుకోనున్నారా అంటే అవుననే అంటున్నారు. స్మార్ట్ విలేజ్ గా డవలప్ చేయటానికి ఆ గ్రామాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుంటూరు ఎంపి గల్లా జయిదేవ్ తెలియచేసారు. అలాగే కృష్ణ గారి పెద్ద అమ్మాయి ..మహేష్ సోదరి అయిన పద్మ..కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్ గా ఎడాప్ట్ చేయనున్నారని తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ విషయమై గల్లా జయదేవ్ మాట్లాడుతూ..., "ఎలక్షన్స్ కు ముందు నేను బుర్రిపాలెం ను దత్తత తీసుకుందామనుకున్నాను, కానీ రాజకీయనాయకులకు ఉండే కొన్ని నిబంధలుతో అది సాధ్యం కావటం లేదు. ఎందుకంటే...వారు తమ సొంత గ్రామాల్ని ఎడాప్ట్ చేసుకోరాదని రూల్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యిపోయాయి, నా బావమ బుర్రపాలెంను దత్తత తీసుకుని అభివృద్ది చేయనున్నారు. అది ఆయన నేటివ్ ప్లేస్ కూడా " అని చెప్పుకొచ్చారు.

మహేష్ ప్రస్తుత చిత్రం విషయానికి వస్తే...

Mahesh Babu to Adopt Burripalem in Guntur

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రుతిహాసన్ లు జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా యూనిట్ పోలాచ్చి నుంచి తిరిగి వచ్చిన తరువాత సన్నీలియోన్ తో ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన సెట్ ను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈసారి సన్నీతో మహేష్ స్టెప్స్ వేస్తే ఈ సినిమాకు బయ్యర్లలో మరింత క్రేజ్ పెరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారు అని చెప్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 17 న మహా శివరాత్రి పూట విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే ఆ రోజు అభిమానుల ఆనందం ఏ రేంజిలో ఉంటుంమదో ఊహించండి. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిర్మాత,దర్శకుడు ఇప్పటివరకూ ఏ టైటిలూ ప్రకటించలేదు.

Mahesh Babu to Adopt Burripalem in Guntur

శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.

అయితే తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.

మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Galla Jayadev said, "Although I've plans to adopt Burripalem much before the elections, I couldn't due to certain rules that politicians, public representatives should not adopt native villages. Now that elections are over, my brother-in-law will adopt the village Burripalem which also happens to be his native village."
Please Wait while comments are loading...