»   » హీరో నాని సినిమాకు మహేష్ బాబు సపోర్టు!

హీరో నాని సినిమాకు మహేష్ బాబు సపోర్టు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు చిన్న హీరోల సినిమాల ఆడియో వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వడం, వారి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం చూస్తేనే ఉన్నాం. పెద్ద హీరోలు ఇలాంటి వేడుకలకు వచ్చారంటే ఆ సినిమాకు వారి సపోర్టు ఇచ్చినట్లే...ఫలితంగా ఆయా సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.

ఈ నెల 18న జరుగబోతున్న ‘కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమా ఆడియో వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మహేష్ బాబుతో దూకుడు, ‘1-నేనొక్కినే', ‘ఆగడు' చిత్రాలు తెరకెక్కించిన 14రీల్స్ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ‘కృష్ణగాడి వీరప్రేమగాధ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Mahesh Babu to launch Nani's 'KVG'

నాని ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. గతంలో ఈ సినిమాకు ‘జై బాలయ్య' అనే టైటిల్‌ వినిపించింది. అయితే ఈ టైటిల్ ఒక వర్గానికి చెందినదిగా ఉండటంతో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' గా మార్చారు. అనంతపుతం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

English summary
Prince Mahesh will launch the audio of Nani's Krishnagadi Veerapremagadha' on 18th of this month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu