»   » ర్యాంకింగ్ లలో ఒకమెట్టు దిగిన మహేష్ : రామ్ చరణ్ లిస్టులోనే లేడు, ప్రభాస్ 22 స్థానం

ర్యాంకింగ్ లలో ఒకమెట్టు దిగిన మహేష్ : రామ్ చరణ్ లిస్టులోనే లేడు, ప్రభాస్ 22 స్థానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

2013లో టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ 50 లిస్టులో మహేష్ ఏకంగా నెం.1 స్థానంలో ఉన్నాడు. అప్పట్లో మనోడికి ఏకంగా 7.34 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక 2015 నాటికి 6వ స్థానానికి వచ్చేశాడు. ఇప్పుడు 2016కు గాను మనోడు 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇదే లిస్టుకు సంబంధించి 2015వ సంవత్సరంలో 6వ స్థానంలో నిలిచిన ప్రిన్స్ 2016కు ఒక స్థానం కిందకి దిగడం కొంత వరకు షాకింగ్ న్యూస్.

22వ స్థానంలో ప్రభాస్

22వ స్థానంలో ప్రభాస్

గత ఏడాది ‘బ్రహ్మోతవం' లాంటి భారీ ఫ్లాప్ మూవీలో నటించాక కూడ మహేష్ కు ఈ ర్యాంక్ రావడం అతని స్టామినాను సూచిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈరోజు ప్రకటించిన 2016 డిజైబుల్ లిస్టులో.. మిష్టర్ ఇండియా రోహిత్ కందేల్వాల్ నెం.1 స్థానం కైవసం చేసుకున్నాడు. అలాగే విరాట్ కొహ్లీ నెం.2 స్థానంలో ఉన్నాడు. ఇక హృతిక్ రోషన్ 3వ పొజిషన్లో ఉండగా.. గతేడాది నెం.1 స్థానం కొట్టిన రణవీర్ సింగ్ ఇప్పుడు 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రామ్ చరణ్

రామ్ చరణ్

ఈ టాప్ 50 లిస్టులో మన తెలుగు నుండి సెలక్ట్ అయిన ఇతర స్టార్లను చూస్తే.. 22వ స్థానంలో ప్రభాస్.. 24వ స్థానంలో రానా దగ్గుబాటి ఉండగా.. గతంలో ఈ లిస్టులో క్రేజ్ సాధించిన రామ్ చరణ్ మాత్రం ఏకంగా టాప్ 50 నుండే ఎగిరిపోయాడు. ఇది మాత్రం మెగా ఫ్యాన్స్ కి మింగుడు పడని విషయమే.

మనవాళ్ళు ముందున్నప్పుడు కూడా

మనవాళ్ళు ముందున్నప్పుడు కూడా

కాకపోతే ప్రభాస్ కు ఉన్న క్రేజేంటో బాహుబలి ద్వారా కనిపించాక.. ఈ లిస్టుకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటని తెలుగు ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మనవాళ్ళు ముందున్నప్పుడు కూడా ఇలాగే అడిగి ఉంటే బాగానే ఉండేది. మనం బావున్నప్పుడు విలువలు మాట్లాడి, బాలేనప్పుడు లెక్కలు మాట్లాడకూడదు సార్ అని త్రివిక్రమ్ చెప్పనే చెప్పాడు కదా...

మహేష్ క్రేజ్ చెక్కు చెదరలేదు

మహేష్ క్రేజ్ చెక్కు చెదరలేదు

గత సంవత్సర కాలంగా మహేష్ నటించిన ఏ ఒక్క సినిమా విడుదల కాకపోయినా మహేష్ క్రేజ్ చెక్కు చెదరలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మహేష్ ‘స్పైడర్' ను ఈ దసరాకు ఎన్ని సినిమాల పోటీ ఉన్నా విడుదల చేసితీరాలని మహేష్ గట్టి పట్టుదల పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

స్పైడర్

స్పైడర్

దీనికి కారణం సెప్టెంబర్ 27 నుండి వరసగా వస్తున్న ఆరు రోజుల సెలవులు అని అంటున్నారు. ఇటువంటి వరస హాలిడేస్ మళ్ళీ సంక్రాంతి వరకు లేని నేపధ్యంలో ఎంతమంది హీరోల పోటీ ఉన్నా ‘స్పైడర్' ను విడుదల చేసితీరాలి అని మహేష్ చేస్తున్న ఒత్తిడికి దర్శకుడు మురగదాస్ సతమతమవుతున్నట్లు టాక్..

నాని 3 స్థానం లో

నాని 3 స్థానం లో

ఇక తెలుగు పరంగా చూస్తే.. మహేశ్ రెండో స్థానంలో కి వచ్చేసాడు. ఎవ్వరూ ఊహించని విధంగా నాని 3 స్థానం లో ఉన్నాడు గత ఐదేళ్లుగా బాహుబలి ప్రభంజనం కొనసాగినా.. ప్రభాస్ గానీ, రానా గానీ టాప్‌3లో చోటు దక్కించుకోలేకపోయారు.. ఏ స్టార్ హీరో కూడా సాధించలేనిది నాని సాధించడం విశేషం.

పవర్‌స్టార్ 11వ స్థానంలో

పవర్‌స్టార్ 11వ స్థానంలో

నాని తర్వాత నాలుగో స్థానంలో రానా, ఐదో స్థానంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నిలిచారు. ఇక, విశేషాభిమానులున్న పవన్ కల్యాణ్.. ఈ జాబితాలో టాప్ టెన్‌లోనే లేకపోవడం గమనార్హం. పవర్‌స్టార్ 11వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక, ఆరో స్థానంలో ప్రభాస్, ఏడోస్థానంలో నాగచైతన్య, 8వ స్థానాన్ని అల్లు అర్జున్, 9వ స్థానాన్ని సుధీర్ బాబు, 10వ స్థానాన్ని నాగశౌర్య దక్కించుకున్నారు.

English summary
Times Of India announced its annual list of Most Desirable men. Mahesh Babu has 7 th place the list among Indian celebrities again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu