»   » మనం: అఖిల్ ఎంట్రీపై మహేష్ బాబు కామెంట్

మనం: అఖిల్ ఎంట్రీపై మహేష్ బాబు కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో చివర్లో అక్కినేని అఖిల్ ఎంట్రీ అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. అకిల్ లుక్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఫ్యూచర్లో మంచి స్టార్‌‌గా ఎదుగుతాడని పలువురు ప్రశంసిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే రకమైన స్పందన తన ట్విట్టర్ ద్వారా వెలుబుచ్చారు. ' సినిమా చివర్లో అఖిల్ అతిథి పాత్రలో ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుర్రాడి స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది. భవిష్యత్‌లో స్టార్‌గా ఎదుగుతాడు' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

Mahesh Babu tweet about Akhil

త్వరలో అఖిల్ హీరోగా సినిమా రాబోతోంది. 'మనం' సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న అఖిల్ తాజాగా మీడియాతో మాట్లాడాడు.. ఈ సందర్భంగా ఆయన తన సినిమాల విషయాలు గురించి చెప్పాడు. హీరోగా నేను ఎంట్రీ ఇవ్వబోయే సినిమా పనులు త్వరలో ప్రారంభమవుతాయి. మనం సినిమా నాకు ట్రైలర్ మాత్రమే. మరో ఇరవైరోజులు ఓపికపడ్డండి నా కొత్త సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తాను. కథ పనులు చివరి దశకొచ్చాయి. యాక్షన్, ప్రేమ, వినోదం కలగలిపి ఓ మంచి సినిమాతో మీముందుకు వస్తానని అఖిల్ తెలిపాడు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>pleasantly surprised by Akhil's cameo in the end..the boy has amazing screen presence....a star to look out for in the future.:)</p>— Mahesh Babu (@urstrulyMahesh) <a href="https://twitter.com/urstrulyMahesh/statuses/473329202725257216">June 2, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

అక్కినేని, నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణ మురళి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.

English summary
“Pleasantly surprised by Akhil’s cameo in the end..the boy has amazing screen presence….a star to look out for in the future “, Mahesh Babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu