»   » ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో మహేష్ బాబు

ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా శ్రీమంతుడు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు అదరగొడుతోంది. వీకెండ్ తో పాటు వీక్ డేస్ సోమ, మంగళ వారాల్లో కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. తొలి ఐదు రోజుల్లో ‘శ్రీమంతుడు' చిత్రం వరల్డ్ వైడ్ రూ. 51 కోట్ల షేర్ సాధించడం విశేషం. దీంతో మహేష్ బాబు కెరీర్లో రూ. 50 కోట్లు వసూలు చేసిన చిత్రాల సంఖ్య మూడుకు చేరుకుంది.

Mahesh Babu unique feat of three 50 cr films

ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూ. 51 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘దూకుడు' చిత్రం రూ. 57 కోట్లు వసూలు చేసింది. తాజాగా శ్రీమంతుడు కూడా రూ. 50 కోట్ల క్లబ్ లో చేరడం గమనార్హం. ఈ వీకెండ్ ఆగస్టు 15 కూడా ఉండటంతో సినిమాకు కలెక్షన్లు బాగా కలిసొస్తాయని భావిస్తున్నారు.


శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సొంత ఊరుకు మంచి చేయాలనే కాన్సెప్టుతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

English summary
Mahesh created a unique feat of bagging three 50 crore films. In the past, Mahesh’s Seethamma Vakitlo Sirimalle Chettu (51 crore) and Dookudu (57 crore) entered the 50 crore club and Srimanthudu is all set to surpass Dookudu collections within this weekend.
Please Wait while comments are loading...