»   » బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్లో మహేష్ బైక్ అదిరింది

బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్లో మహేష్ బైక్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మద్య సినిమా ప్రచారం లోనూ కొత్త కొత్త పద్దతులు వచ్చాయి, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ , ప్రోమో, ట్రైలర్... ఇలా అంతా ఓ షెడ్యూల్ అయిపోయింది.అన్నిటినీ ఫాలో అవాల్సి వస్తోంది. మహేష్ తాజా సినిమా బ్రహ్మోత్సవం టీం కూడా మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది.

ఇప్పటికే ఆసినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు మరో కానుక అందించాడు. బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ట్విటర్ ద్వారా రిలీజ్ చేసి ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. వెరైటీగా త్రీ వీల్స్ బుల్లెట్ పై మహేష్ దూసుకుపోతున్నట్లు ఈ మోషన్ పోస్టర్ డిజైన్ చేసారు. మహేష్ వాడిన బైక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది. మహేష్ కోసం స్పెషల్ గా తీర్చిదిద్దిన త్రీ వీలర్ బైక్ ఇది.

Brahmostsavam

'బ్రహ్మోత్సవం' ఆడియో మే 6న విడుదల చేయనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించారు.

English summary
The motion of Brahmostsavam poster is now one of the talking points of social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu