For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్‌బాబు రహస్య పర్యటన.. నమత్రతో కలిసి ముంబైలో.. ఎందుకు వెళ్లాడో తెలుసా? (ఫొటోలు)

  By Rajababu
  |
  మహేష్ సీక్రెట్ ట్రిప్ ! ఎందుకు వెళ్లాడో తెలుసా?

  దక్షిణాది అగ్ర హీరోలంతా ఈ మధ్యకాలంలో ముంబైలో హడావిడి చేస్తున్నారు. సాహో చిత్రం కోసం ప్రభాస్, కాలా చిత్రం కోసం రజనీకాంత్‌ ముంబైను అడ్డాగా చేసుకోవడం తెలిసిందే. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఏదో పనిమీద సల్మాన్‌తో భేటి కావడం, సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబైలో కనిపించిన మీడియాలో కొద్దిరోజుల క్రితం మీడియాలో వైరల్‌గా మారింది.

  నమత్రతో కలిసి ప్రిన్స్ మహేశ్

  నమత్రతో కలిసి ప్రిన్స్ మహేశ్

  తాజాగా ప్రిన్స్ మహేశ్‌బాబు తన భార్య నమ్రతాతో కలిసి ముంబైలో దర్శనమిచ్చాడు. ముంబైలో ప్రిన్స్ అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. ఎందుకంటే ముంబై మహేశ్‌కు అత్తారిల్లు లాంటింది. నమ్రత మహారాష్ట్రకు చెందిన వారే. బాలీవుడ్‌లోనే తన కెరీర్‌ను ప్రారంభించారు కూడా. ఆ తర్వాతే టాలీవుడ్‌కు పరిచయమైంది.

  ముంబైలో మహేశ్ బాబు హల్‌చల్

  ముంబైలో మహేశ్ బాబు హల్‌చల్

  టాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూనే ఘట్టమనేని ఇంటికి కోడలు అయింది. అప్పటి నుంచి అడపాదడపా ముంబైకి వెళ్లి రావడం జరుగుతుంది. తాజాగా మళ్లీ మహేశ్‌తో కలిసి ముంబైలో కనిపించడం మీడియా కంటపడింది. దాంతో ఎందుకు ముంబైకి వెళ్లారు అనేది ప్రశ్నగా మారింది.

  మహేశ్ బ్రాండింగ్‌పై నమత్ర దృష్టి

  మహేశ్ బ్రాండింగ్‌పై నమత్ర దృష్టి

  దక్షిణాదిలో ప్రిన్స్ మహేశ్‌ది హవా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్‌ హీరోలను తలదన్నేలా అందం, నటన అని మహేశ్‌కు ఉన్నాయి. బాహుబలి తర్వాత తెలుగు హీరోల బ్రాండ్ ఇమేజ్ ఉత్తరాదిలో పెరిగింది. ఆ విషయాన్ని అర్థం చేసుకొన్న నమత్ర.. బాలీవుడ్‌లో మహేశ్‌బాబు బ్రాండింగ్‌ను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  మహేశ్‌బాబు సినిమాల బిజినెస్

  మహేశ్‌బాబు సినిమాల బిజినెస్

  మహేశ్ నటించిన చిత్రాలను హిందీలో ప్రమోట్ చేయడానికి, ఆయన సినిమాల బిజినెస్‌పై నమత్ర ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. స్పైడర్ చిత్రానికి సంబంధించిన బిజినెస్‌ను కూడా ఆమె డీల్ చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేశ్ దృష్టి ముంబై బాగానే పడింది. బిజినెస్‌మ్యాన్ సినిమాలో మహేశ్ డైలాగ్స్ చెప్పినట్టు.. ప్రిన్స్ ఏదో అల్లాటప్పా పర్యటన కాకపోవచ్చు.. బాలీవుడ్‌లో ఏదో కీలక విషయంపై వెళ్లి ఉండవచ్చనే వార్తలు షికారు చేస్తున్నాడు

  బాలీవుడ్ హీరోలను తలదన్నేలా

  బాలీవుడ్ హీరోలను తలదన్నేలా

  నమత్రతో కలిసి ముంబైలో కనిపించిన మహేశ్ చెక్స్ షర్టులో అందంగా కనిపించారు. తలపై బేస్‌బాల్ క్యాప్, గాగూల్స్‌తో హిందీ హీరోల మాదిరిగా హ్యాండ్సమ్‌గా కనిపించారు. కారులో నమత్రతో కలిసి వెళ్తున్న దృశ్యాలను కెమెరాలు క్లిక్ మనిపించాయి. నమత్ర కుటుంబ సభ్యులను కలువడానికి వెళ్లినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

  రిలీజ్ వివాదంలో భరత్ అను నేను

  రిలీజ్ వివాదంలో భరత్ అను నేను

  కాగా, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను అనే చిత్రంలో నటిస్తున్నాడు మహేశ్. ఈ చిత్రం ఏప్రిల్ మాసంలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే అదే పమయంలో రజనీకాంత్ రోబో2ను కూడా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించడం వివాదంగా మారింది.

  రోబో2ను ఢీకొట్టడానికి మహేశ్‌బాబు రెడీ

  రోబో2ను ఢీకొట్టడానికి మహేశ్‌బాబు రెడీ

  రోబో2 చిత్రాన్ని జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ముందు ప్రకటించారు. ఏవో సాంకేతిక కారణాల వల్ల చిత్ర విడుదల వాయిదా పడింది. ఆ కారణంగానే భరత్ అనే నేను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే మళ్లీ ఏప్రిల్‌లోనే రోబో వస్తుండటంతో పోటీగా తమ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌ను మహేశ్ మార్చుకోవాలనుకొంటున్నారనే వార్త మీడియాలో ప్రచారమైంది. కానీ అలాటిందేమీ లేదు. ఏప్రిల్ మూడో వారంలోనే భరత్ అనే నేను సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు.

  English summary
  Prince Mahesh Babu in Mumbai town Now. He was spotted at Mumbai airport with his wife Namrata Shirodkar. Namrata has come down to Mumbai, with her hubby, for a visit to her family. Mahesh Babu was looking handsome in a checked shirt and pretty much hid from shutterbugs with a cap and shades.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X