»   » మూవీ మిక్స్: మహేష్ వాయిస్, ధనుష్ మాస్, నాగార్జున 110 సెంటర్స్!

మూవీ మిక్స్: మహేష్ వాయిస్, ధనుష్ మాస్, నాగార్జున 110 సెంటర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

1. శ్రీను వైట్ల-వరుణ్ తేజ్ కాంబినేష​​​​న్లో​​​ 'ఠాగూర్' మధు, నల్లమలుపు బుజ్జి సినిమా

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో వరుణ్ తేజ్ కాంబినేష​​న్లో సినిమా ఖరారైంది. 'ముకుంద' చిత్రం ద్వారా వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసిన 'ఠాగూర్' మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని అందించిన శ్రీను వైట్ల తనదైన శైలిలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన ఇద్దరు ప్రముఖ కథానాయికలు నటించనున్నారు. ఏప్రిల్ 8 ఉగాది పర్వదినం నాడు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Mahesh Babu voice over for Sri Sri movie

వరుణ్ తేజ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ కథ ఇదనీ, శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రం క్లాస్ నీ, మాస్ నీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని కూడా చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్ ('కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్).

Mahesh Babu voice over for Sri Sri movie


2. 'శ్రీశ్రీ' చిత్రానికి మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ కథానాయకుడిగా, శ్రీమతి విజయనిర్మల కథానాయికగా కలిసి నటంచిన ఎస్‌.బి.ఎస్‌. ప్రొడక్షన్స్‌ సంస్థ..దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో యువ నిర్మాతలు శ్రీ సాయిదీప్‌ చాట్ల, వై. బాలు రెడ్డి, షేక్‌ సిరాజ్‌లు నిర్మించిన చిత్రం ''శ్రీశ్రీ''. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ మధ్యనే విడుదల అయిన ఆడియోకి సంగీత ప్రియుల వద్ద నుండి మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Mahesh Babu voice over for Sri Sri movie

మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌:
ఈ చిత్రం గురించి దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ..'హీరో కృష్ణ స్వర్ణోత్సవ చిత్రంగా మేము నిర్మించిన శ్రీశ్రీ చిత్రానికి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఇది స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ కార్యక్రమం శబ్ధాలయా థియేటర్‌లో ఇటీవల జరిగింది. ఇందులో డీసీపీ పాత్రను సుధీర్‌బాబు అద్భుతంగా పోషించాడు. పతాక సన్నివేశాల్లో వచ్చే ఈ పాత్ర అన్ని తరగతుల వారిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలై మంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. శివరాత్రికి ఫస్ట్‌కాపీ సిద్ధం అవుతున్న శ్రీశ్రీ చిత్రాన్ని సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 3 వారంలో విడుదల చేసేందుకు మా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు...' అని చెప్పారు.

'శ్రీశ్రీ' చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రీ సాయిదీప్‌ చాట్ల మాట్లాడుతూ..'మా అభిమాన కథానాయకుడైన సూపర్‌స్టార్‌ కృష్ణగారితో మేము నిర్మించిన 'శ్రీశ్రీ' చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. దర్శకులు ముప్పలనేని శివ ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుండి కాపీ వచ్చేంత వరకు అహర్నిశలు శ్రమించి దీనిని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారు. ఆయన మాకు చెప్పిన దానికన్నా 100 శాతం ఇంకా బాగా తీశారు. ఇది మా హీరో కృష్ణగారికి ఓ అపురూపమైన చిత్రం అవుతుంది. ఇక 'శ్రీశ్రీ' చిత్రాన్ని మార్చి మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..' అని అన్నారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, నరేష్‌, సాయికుమార్‌, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్‌, తోటపల్లి మధు, దేవదాస్‌ కనకాల, మురళీశర్మ, కునాల్‌ కౌశిక్‌, శ్రీమతి అనితాచౌదరి, సోఫియా మొదలగువారు నటించిన ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా పతాక సన్నివేశాల్లో హీరో సుధీర్‌బాబు ఒక ప్రత్యేకమైన పాత్రను చేశారు.

ఈ చిత్రానికి మాటలు: రామ్‌ కంకిపాటి, కథ: రమేష్‌ డియో ప్రొడక్షన్స్‌, ఫైట్స్‌: నందు, సంగీతం: ఇఎస్‌. మూర్తి(గమ్యం ఫేమ్‌), సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల, ఆర్ట్‌: అశోక్‌, ఎడిటింగ్‌: రమేష్‌, కాన్సెఫ్ట్‌ రైటర్‌: కళ్యాణ్‌జీ, కో-డైరెక్టర్‌: రమేష్‌రాజా.ఎమ్‌., అసోసియేట్‌ డైరెక్టర్స్‌: విజయ్‌భాస్కర్‌. కె, నిమ్మకాయల కోఠి, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: తాండవ కృష్ణ, నారాయణ, నిర్మాతలు: శ్రీ సాయిదీప్‌ చాట్ల, వై. బాలు రెడ్డి, షేక్‌ సిరాజ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ముప్పలనేని శివ.


3. 110 కేంద్రాల్లో కింగ్‌ నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' అర్ధశతదినోత్సవం

2016 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకొని 53 కోట్లకు పైగా షేర్‌ సాధించి బాక్సాఫీస్‌ని షేక్‌చేసిన కింగ్‌ నాగార్జున లేటెస్ట్‌ బంపర్‌ హిట్‌ 'సోగ్గాడే చిన్నినాయనా' 110 కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకుని శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో కింగ్‌ నాగార్జున నిర్మించిన 'సోగ్గాడే చిన్నినాయనా' ద్వారా యువ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన ఘనతను 'సోగ్గాడే చిన్నినాయనా' దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దక్కించుకున్నారు.

Mahesh Babu voice over for Sri Sri movie

అన్నివిధాల సంతృప్తిని కలిగించిన విజయం
'సోగ్గాడే చిన్నినాయనా' ఘన విజయంపై కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''సంక్రాంతికి విడుదలై అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో 50 రోజులు పూర్తి చేసుకుని ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని అందరికీ నచ్చేలా తీశాడు. అందుకే ఇంత పెద్ద హిట్‌ అయింది. నా అభిమానులంతా 'సోగ్గాడే' విజయాన్ని చూసి గర్వపడుతున్నారు. వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా వుంది. ఈ సినిమాలో నాన్నగారి పంచెల్ని, వాచీని వాడాము. నాన్నగారి ఆశీస్సులు కూడా వున్నందువలనే ఇంత పెద్ద విజయం లభించిందని నా నమ్మకం. 'మనం' తర్వాత నాకు అన్నివిధాల సంతృప్తి కలిగించిన విజయం ఇది. హీరోగా, నిర్మాతగా నాకు చాలా చాలా హ్యాపీ. బంగార్రాజు 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు, నాన్నగారి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలోనే 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్‌ 'బంగార్రాజు' వివరాలు చెప్తాను'' అన్నారు.

దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ - ''దర్శకుడుగా నాకు అవకాశం ఇచ్చిన నాగ్‌ సార్‌కి ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నాను. 'సోగ్గాడే చిన్నినాయనా' అన్నపూర్ణ బ్యానర్‌లో చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. తొలి చిత్రంతోనే నాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. 'సోగ్గాడే చిన్నినాయనా'కి సీక్వెల్‌గా చేస్తున్న 'బంగార్రాజు' స్క్రిప్ట్‌ రెడీ అవుతోంది'' అన్నారు.

సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ - ''అన్నపూర్ణ బ్యానర్‌లో 'మనం'లాంటి గొప్ప సినిమా తర్వాత మళ్లీ 'సోగ్గాడే చిన్నినాయనా'లాంటి గొప్ప విజయం లభించినందుకు చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

కింగ్‌ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, డా|| బ్రహ్మానందం, సంపత్‌, నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖావాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.


4. 18న వస్తున్న ధనుష్-కాజల్ "మాస్"

సూపర్ మాస్ హీరో ధనుష్-సూపర్ బ్యూటి కాజల్ జంటగా నటించగా తమిళంలో మంచి విజయం సాధించిన "మారి" అనే చిత్రం తెలుగులో "మాస్" పేరుతో అనువాదమవుతోంది. "వి. ఎం. అర్" సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. "లవ్ ఫెయిల్యూర్" ఫేం బాలాజీ మోహన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి "వై దిస్ కొలవేరి ఫేం" అనిరుధ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Mahesh Babu voice over for Sri Sri movie

నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. "ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్, సాహితి అందించిన మాటలు-పాటలు బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం "మాస్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నూ అమితంగా అలరించే చిత్రమిది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది" అన్నారు.

విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రసన్న జి.కె, సినిమాటోగ్రఫి: ఓంప్రకాష్, మాటలు-పాటలు: సాహితి, సంగీతం: అనిరుధ్, సమర్పణ: "వి.ఎం.ఆర్", నిర్మాత: వాసిరెడ్డి పద్మాకరరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: బాలాజీ మోహన్ !!

English summary
Mahesh Babu voice over for his father krishna's Sri Sri movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu