»   » శ్రీమంతుడు: న్యూ లుక్ ఇదే... (ఫోటో)

శ్రీమంతుడు: న్యూ లుక్ ఇదే... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబుకు సంబంధించిన న్యూ లుక్ ఫోటో విడుదల చేసారు. ఇందులో మహేష్ బాబు లుక్ సూపర్బ్ గా ఉంది.

ఆడియోని జూలై 18న ఘనంగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. సినిమాను ఆగస్టు 7న విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి జులై 17నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ‘బాహుబలి' కోసం వాయిదా వేసుకున్నారు.


Mahesh Bahu's Sreemanthudu new look

ఇక ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని, టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్‌పై స్త్టెలిష్‌గా కనిపిస్తున్న మహేష్‌ లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు.


ఈ సినిమాకు మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

English summary
Mahesh Bahu's Sreemanthudu movie new look released.
Please Wait while comments are loading...