»   »  పేద‌పిల్లల కోసం ట్రస్టు స్థాపించనున్న మహేష్ బాబు

పేద‌పిల్లల కోసం ట్రస్టు స్థాపించనున్న మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  విజయవాడ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ట్రస్ట్ స్థాపించబోతున్నాడు. విజయవాడలో రెయిన్ బో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన మహేష్ బాబు ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయట పెట్టారు. క్యాన్సర్, గుండె సంబంధ, కాలేయ సంబంధమైన ప్రాణాంతకమైన వ్యాధులతో బాధ పడే పేద పిల్లలకు సహాయ కారిగా ఈ ట్రస్టును నిర్వహించనున్నారట.

  ఈ విషయమై మహేష్ బాబు మాట్లాడుతూ...'త్వరలో ఓ ట్రస్టు స్థాపించాలనే ఆలోచన ఉంది. పేద పిల్లలకు సహాయం చేయాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించబోతున్నాం. క్యాన్సర్, గుండె, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించడం దీని లక్ష్యం. ఇతర ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యంతో దీన్ని స్థాపించబోతున్నాను. మూడు నెలల్లో ట్రస్టు గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాను' అన్నారు.

  ఇప్పటికే పలువురు టాప్ తెలుగు హీరో వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ...మానవతా వాదులు అని పేరు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలో మహేష్ బాబు కూడా ఆ లిస్టులో చేరబోతున్నారు. కెరీర్ పరంగా మంచి విజయాలు సాధిస్తూ, బాగా సంపాదిస్తూ పూర్తి సంతృప్తిగా ఉన్న మహేష్ బాబు ట్రస్టు స్థాపించాలనే ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు.

  ప్రస్తుతం మహేష్ బాబు, సుకుమార్ దర్శకత్వంలో '1-నేనొక్కడినే' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మహేష్ సినిమాకు ఆయన తొలిసారి పనిచేస్తుండటం విశేషం. ఇప్పటివరకూ సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిని మించేలా అద్భుతమైన సంగీతాన్ని దేవిశ్రీ అందించినట్లు సమాచారం.

  మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

  English summary
  Mahesh expressed interest about establishing a trust in association with a private hospital. The trust lends financial assistance to ailing kids. "I have the intention to establish a trust soon to benefit children in low-income groups. Such confidence treat poor children with cancer, heart disease and liver disease. Trust will work in partnership with Arch Hospital Iris.’ll make a formal announcement in about three months," Actor Mahesh Babu said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more