»   »  ఓ వైపు ‘అర్జున్ రెడ్డి’ హీట్.... రెడ్డి, కమ్మ కులం పేర్లతో టైటిల్‌పై కామెంట్!

ఓ వైపు ‘అర్జున్ రెడ్డి’ హీట్.... రెడ్డి, కమ్మ కులం పేర్లతో టైటిల్‌పై కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా 'అర్జున్ రెడ్డి' సినిమా గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. సినిమాకు బాగా హైప్ రావడంతో పాటు, పలువు వివాదాలు కూడా చుట్టుముట్టడమే ఇందుకు కారణం. ఓ వైపు అంతటా 'అర్జున్ రెడ్డి' హీట్ కొనసాగుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్, సినీ విమర్శకుడు మహేష్ కత్తి, ప్రముఖ సినీ రచయిత సిరాశ్రీ చేసిన కామెంట్ చర్చనీయాంశం అయింది.

సినిమా టైటిల్స్ లో కులాల పేర్ల ప్రస్తావనపై ఈ ఇద్దరూ కామెంట్ చేశారు. తొలుత మహేష్ కత్తి ఈ విషయాన్ని లేవనెత్తగా, సిరాశ్రీ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరి వారు ఏం కామెంట్ చేశారు. అవి నెగెటివ‌్ కామెంట్సా? లేక పాజిటివ్‌గా ఉన్నాయా? చూద్దాం.

మహేష్ కత్తి కామెంట్

మహేష్ కత్తి కామెంట్

Mahesh Kathi పెట్టిన పోస్ట్- "అర్జున్ రెడ్డి. నరసింహ నాయుడు. పెదరాయుడు. రామన్న చౌదరి అనే సినిమా టైటిల్స్ నాకు సమస్య కాదు. కాకపోతే, కృష్ణ మాదిగ. మాల రాముడు అనే టైటిల్స్ తో త్వరలో సినిమాలు రావాలని మాత్రం కోరుకుంటాను. సింపుల్."

మహేష్ కత్తి పోస్టుపై సిరాశ్రీ అభిప్రాయం

మహేష్ కత్తి పోస్టుపై సిరాశ్రీ అభిప్రాయం

మహేష్ కత్తి పోస్టును ఉద్దేశించి సిరాశ్రీ స్పందిస్తూ.... అలా కోరుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. ఆ మధ్య నా బ్రాహ్మణ ఫ్రెండ్ ఒకడు సరదాగా అన్నాడు- "అర్జున్ శర్మ", "నరసింహ శాస్త్రి", "పెద్దపంతులు" అని టైటిల్స్ పెట్టి మాంఛి యాక్షన్ సినిమాలు తీయొచ్చుకదా. మనం కూడా కాసేపు హీరోల్లా ఫీలవ్వచ్చు" అని. తర్వాత "సీమశాస్త్రి" వచ్చింది. "ఇలా కామెడీ సినిమా తీసారేంటి" అని నిట్టూర్చాడు!- మళ్లీ సరదాగానే!

నా వైశ్య మిత్రుడు

నా వైశ్య మిత్రుడు

నా వైశ్య మిత్రుడు ఒకడు "ఎప్పుడో షావుకారు అనే టైటిల్ తో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినిమా వచ్చింది. తర్వాత సినిమాల్లో మా కులాన్ని పట్టించుకున్నవాడే లేడు" అన్నాడు సరదాగా!

ఇక పాయింట్ కి వస్తే, టైటిల్లో పెట్టకపోయినా, "స్వయంకృషి"లో చిరంజీవి పాత్రది ఏ కులం? ఎంత ఉదాత్తమైన పాత్ర...నిజంగా అందరికీ రోల్ మోడల్ క్యారక్టర్ అది. తెలుగు సినిమా పుట్టిన కొత్తల్లో "మాలపిల్ల" సినిమా వచ్చింది. అదెంత ప్రొగ్రెసివ్ కథ! "రుద్రవీణ" కథలో "మాలపిల్ల" స్ఫూర్తి కూడా కనిపిస్తుంది అని సిరాశ్రీ అన్నారు.

కమ్మ, రెడ్డి

కమ్మ, రెడ్డి

ఇక కమ్మ, రెడ్డి కులాల టైటిల్స్ వెనుక ఉన్న విషయం ఒక్కసారి ఆలోచించాలి. సినీపరిశ్రమ అనే కాదు...రాజకీయాలు, ప్రైవేట్ విద్యారంగం, వ్యాపారరంగం ఇలా పలు రంగాల్లో ఆ రెండు కులాల వాళ్లు దూసుకెళ్లిపోయారు. మిగిలిన కులాలవాళ్లల్లో అధికశాతం మంది వాళ్ల స్టూడియోల్లోనో, కంపెనీల్లోనో, వాళ్ల కాలేజీల్లోనో, సంస్థల్లోనో ఉద్యోగాలు చేస్తున్నారు. అందరికీ ఉంటుందనలేను కానీ పెట్టే స్థాయిలో ఉన్నవాడికి పుచ్చుకునే స్థాయిలో ఉన్నవాడికంటే కాస్త దర్పం ఎక్కువే ఉంటుంది. అది సహజం. ఆ దర్పం నిజంగా పెట్టేవాడికి లేకపోయినా ఆ కులంలో పుట్టి ఖాళీగా కూర్చున్నవాడికైనా క్యాస్ట్ ఫీలింగ్ కారణంగా వచ్చే అవకాశం ఉంది. ఆ ఫీలింగ్ మిగిలిన కులాల ఆత్మగౌరవాన్ని మాటలచేతో, చేతల చేతో కించపరచనంత వరకూ అంగీకారమే అవుతుంది. ఆ కారణంగానే టైటిల్స్ లో రెడ్డి, చౌదరి అని ఉన్నా మెజారిటీ జనానికి అది యాక్సెప్టుబుల్ అయ్యింది..... అని సిరాశ్రీ తెలిపారు.

ఆ రెండు కులాల పట్ల

ఆ రెండు కులాల పట్ల

ఇది నేను కాన్షియస్ గా చెబుతున్నాను కానీ, సబ్ కాన్షియస్ గా చాలామందిలో ఆ రెండు కులాల పట్ల పైన చెప్పిన కారణాల వల్ల ఒక హీరోయిక్ ఫీలింగ్ ఉందని నా అభిప్రాయం. అందుకే ఆ టైటిల్స్. అఫ్కోర్స్, వేరే ఏ కులం వారి సరసన నిలిచినా ఆ కులానికీ వస్తుంది ఆ ఫాలోయింగ్....

-సిరాశ్రీ

English summary
Tollywood director and movie critic, bigg boss contestant Mahesh Kathi and Sirasri Hot comments on caste based movie titles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu