Don't Miss!
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఫ్యాన్స్ డిమాండ్స్ కి తలొగ్గిన ప్రిన్స్ మహేష్ బాబు...
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం టైటిల్ విషయంలో ఇప్పటి వరకు భిన్న టైటిల్స్ వినిపించిన విషయం తెలిసిందే..అయితే మొదటి నుండి అనుకుంటున్నట్లుగా..మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి 'ఖలేజా"ని ఎంపిక చేసినట్లుగా మహేష్ బాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అటు ఆన్ స్ర్కీన్ ఫెర్ ఫార్మెన్స్ లోనూ..ఇటు బాక్సాఫీస్ రికార్డ్స్ ని బ్రెక్ చెయ్యడంలోనూ మరోసారి తన 'ఖలేజా" చూపించేందుకు సిద్దమవుతున్నాడు.
మహేష్ బాబు దాదాపు 10 టైటిల్స్ పరీలనలో వున్నా ప్రిన్స్ ఫ్యాన్స్ అందరూ ఖలేజా కే పిఖ్స్ అయిపోయామని, టైటిల్ మార్చితే జనరల్ ఆడియెన్స్ కూడా కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశముందని హెచ్చిరించడంతో ఫ్యాన్స్ డిమాండ్ కి తలొంచిన ప్రిన్స్ 'ఖలేజా"కి ఓకే అనేశాడు. టైటిల్ విషయంలో ఇప్పటి వరకు మహేష్ కూడా..త్రివిక్రమ్ పై అలిగాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి..వాటన్నింటిని తుడిచివేసేలా..అల్రెడీ రిజిష్టర్ అయిన 'ఖలేజా" ను తన టైటిల్ చేసుకుని..త్రివిక్రమ్ తన ఖలేజా నిరూపించుకున్నాడు..అంతేకాదు..గతంలో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 3 అక్షరలా చిత్రం 'అతడు" లానే ఈ చిత్రానికి కూడా మూడు అక్షరాలు ఉండేలా..త్రివిక్రమ్ తన చిత్రానికి టైటిల్ ఎన్నుకోవడంతో..ఈ చిత్రం మహేష్ బాబుకి మరో 'పోకిరి"లా రికార్డులు బ్రద్దలు కొడుతుందని..ప్రిన్స్ అభిమానులు సంబరపడిపోతున్నారు.