»   » రుద్రమదేవి : మహేష్ బాబుపై అది రూమరేనా?

రుద్రమదేవి : మహేష్ బాబుపై అది రూమరేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమ దేవి' చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ సీన్ చిత్రీకరిస్తుండగా మహేష్ బాబు విసిరిన కత్తి అనుష్కకు తాకి గాయపడిందని, అదృష్ట వశాత్తు అది కార్డుబోర్డుతో చేసిన కత్తి కావడంతో ప్రమాదం తప్పిందనే ప్రచారం సాగింది.

అయితే మహేష్ బాబు సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.....'రుద్రమదేవి' సినిమాలో మహేష్ బాబు ఎలాంటి గెస్ట్ రోల్ చేయడం లేదని తెలుస్తోంది. కాకతీయ రాజుల్లో ఒకరైన గోన గన్నారెడ్డి పాత్రను చేయాలని మహేష్ బాబును ఈ చిత్ర దర్శకుడు గుణశేఖర్ సంప్రదించాడని, అయితే మహేష్ బాబు చేయడానికి తిరస్కరించారని సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న '1' మూవీ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ లండన్లో జరుగుతోంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 20 వరకు అక్కడే షూటింగ్ జరగనుంది.

రుద్రమదేవి సినిమా విషయానికొస్తే...

అనుష్క ప్రధాన పాత్రలో, రాణా హీరోగా గుణా టీమ్ వర్క్ పతాకంపై భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రానికి సంబంధించిన రెండోషెడ్యూల్ పూర్తయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఆగస్టు 1 నుండి ప్రారంభం కానుంది.

భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

English summary
Rumours are rife that Mahesh Babu will be seen in a special role in the period bio-pic Rudramadevi directed by Gunasekhar. However, a source close to Mahesh has quashed all these reports and said that actor is not doing any cameo in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu