»   » మేము బాగానే ఉంటాం: భరత్ సభ తర్వాత పార్టీలో మహేష్, ఎన్టీఆర్, చరణ్... (ఫోటోస్)

మేము బాగానే ఉంటాం: భరత్ సభ తర్వాత పార్టీలో మహేష్, ఎన్టీఆర్, చరణ్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున జరిగింది. 'భరత్ బహిరంగ సభ' పేరుతో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో అభిమాన జనసందోహం పోటెత్తింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేసి సందడి చేశాడు. కాగా ఈ సభ ముగిసిన అనంతరం నిర్మాత దానయ్య స్టార్ హోటల్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.

 పార్టీలో మహేష్, తారక్, చరణ్

పార్టీలో మహేష్, తారక్, చరణ్

హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో మహేష్ బాబు, ఎన్టీఆర్‌తో పాటు హీరో రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు. ముగ్గూరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. అభిమానులకు కనువిందు చేస్తున్న ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

మేము మేము బాగానే ఉంటాం

మేము మేము బాగానే ఉంటాం

భరత్ బహిరంగ సభలో మహేష్ బాబు మాట్లాడుతూ.... పరిశ్రమలో తిప్పి కొడితే ఐదు, ఆరుగురు పెద్ద హీరోలు ఉన్నారు. ఏడాదికి ఒక్క సినిమానే చేస్తాం. మేమంత బాగానే ఉంటాం. ఫ్యాన్సే మధ్య గొడవలు ఉంటాయి. ఇక నుంచి ట్రెండ్ మారుతుంది. అందరు ప్రతీ పెద్ద హీరో సినిమాకు హీరోలు వెళ్తారు. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక మీరే బాగుండాలి అని మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈముగ్గురు హీరోలు కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

టెక్నీషియన్స్ కూడా

టెక్నీషియన్స్ కూడా

దానయ్య ఏర్పాటు చేసిన ఈ పార్టీలో సినిమాకు పని చేసిన పలువురు టెక్నీషియన్స్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు, మరికొందరు పాల్గొన్నారు.

ఇకపై టాలీవుడ్లో ఇలాంటివెన్నో

ఇకపై టాలీవుడ్లో ఇలాంటివెన్నో

ఈ ముగ్గురు స్టార్ హీరోలు కలవడం ఫ్యాన్స్‌కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. దీన్ని ఇన్స్‌స్పిరేషన్ గా తీసుకుంటున్న ఇతర నిర్మాతలు ఇకపై జరిగే సినిమా వేడుకలకు ఇలాంటి సాంప్రదాయాన్నే ఫాలో అవ్వాలనే ఆలోయనలు చేస్తున్నారు.

English summary
A lovely moment after the Bharat Bahiranga Sabha, Check out photos of Mahesh, NTR, Charan in one frame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X