»   »  వీడియో : 'బ్ర‌హ్మోత్స‌వం' షూటింగ్ స్పాట్ సీన్ లీక్, మహేష్, సమంత ఇలా

వీడియో : 'బ్ర‌హ్మోత్స‌వం' షూటింగ్ స్పాట్ సీన్ లీక్, మహేష్, సమంత ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న 'బ్రహ్మోత్సవం'. ఈ సినిమా రోజురోజుకీ అంచనాలు పెంచుకుంటూ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో 'బ్రహోత్సవం' సినిమాపై మొదట్నుంచీ మంచి హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన షూటింగ్ వీడియో ఒకటి లీక్ అయ్యి, సోషల్ మీడియాలో వైరల్ లాగ ముందుకు వెళ్తోంది.

ఇక ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈనెలాఖరుకల్లా టాకీపార్ట్ పూర్తిచేసుకుంటుంది. ఏప్రిల్ నెలలో మిగిలిన రెండు పాటలను పూణే, పొల్లాచ్చిల్లో చిత్రీకరిస్తారు. ఇక దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుంది.

Mahesh's Brahmostavam movie scene leaked

మిక్కీ.జే మేయర్ అందించిన ఈ పాటలను ఏప్రిల్ 24న ఆడియో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. యూనిట్ వర్గాలు తిరుపతిలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు.

ఇక మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ టీజర్ ఏప్రిల్ 8న విడుదల కానుంది. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Brahmotsavam Shooting Spot Leaked Video Between Mahesh Babu And Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu