»   » హాట్ టాపిక్: 'బాహుబలి' రోజునే 'బ్రహ్మోత్సవం'

హాట్ టాపిక్: 'బాహుబలి' రోజునే 'బ్రహ్మోత్సవం'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో భారీగా రూపొందిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం వచ్చే నెల 10న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజు మరో భారీ చిత్రం ప్రారంభమవుతోంది. అది మరేదో కాదు.. మహేష్ హీరోగా రూపొందనున్న 'బ్రహ్మోత్సవం' .

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఆ రోజు అంతటా 'బాహుబలి' గురించే మాటలు ఎక్కడ చూసినా వినిపిస్తాయి. టాక్ ఏంటి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. జనాలు రెస్పాన్స్ ఏంటి అనేదే. వీటికి అతీతంగా మహేష్ తన పనిలో నిమగ్నమైపోనునున్నారన్నమాట. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


'బ్రహ్మోత్సవం' విషయానకి వస్తే...


మహేష్‌బాబు తన కెరీర్‌లో తొలిసారి ముగ్గురు హీరోయిన్స్ తో ఆడిపాడబోతున్నాడు. మహేష్‌ హీరోగా పీవీపీ సినిమా సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాత. ఈ చిత్రంలో మహేష్‌ సరసన కాజల్‌, సమంత, ప్రణీత నటిస్తున్నారు.


Mahesh's Brahmotsavam On Baahubali Day

మహేష్‌- సమంత హిట్‌ కాంబినేషన్‌. 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'లో ఇద్దరూ జంటగా నటించారు. అన్నట్టు మహేష్‌ - కాజల్‌దీ విజయవంతమైన కలయికే. ఇద్దరూ 'బిజినెస్‌మేన్‌' కోసం జట్టుకట్టారు. వచ్చే నెల 10 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ముగ్గురు నాయికల పాత్రలకూ ప్రాధాన్యముంది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది''అన్నారు. జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

English summary
As per the latest news, Brahmotsavam regular shooting will be started on Baahubali Day. Mahesh Babu and Team Brahmotsavam would start its regular shooting on 10th July,the day exactly Baahubali was releasing.
Please Wait while comments are loading...