సూపర్ గా : మహేష్ ‘బ్రహ్మోత్సవం’ టీజర్
హైదరాబాద్ :మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు( జనవరి 1న) నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం యూనిట్ టీజర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ టీజర్ ని చూడవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు.
మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.

మహేష్‌బాబు తన కెరీర్‌లో తొలిసారి ముగ్గురు హీరోయిన్స్ తో ఆడిపాడబోతున్నాడు. మహేష్ హీరోగా పీవీపీ సినిమా సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రసాద్ వి.పొట్లూరి నిర్మాత. ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ముగ్గురు నాయికల పాత్రలకూ ప్రాధాన్యముంది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది''అన్నారు. జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతమందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











