»   » విశేషాలు- ఫొటోలు : 'శ్రీమంతుడు' ఆడియో వేడుక

విశేషాలు- ఫొటోలు : 'శ్రీమంతుడు' ఆడియో వేడుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' పాటల విడుదల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. 'శ్రీమంతుడులో శ్రుతి హాసన్‌ హీరోయిన్ . కొరటాల శివ దర్శకుడు. నవీన్‌యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మాతలు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... ''అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. వాళ్ల కోసం మంచి సినిమాలు చేసేందుకే ప్రయత్నిస్తుంటా. పోయినసారి కాస్త నిరుత్సాహపరిచాను. అందులో నా తప్పుంటే క్షమించండి''అన్నారు మహేష్‌బాబు.


''శ్రీమంతుడు టైటిల్ చాలా బాగుంది. మహేశ్ గ్లామరస్‌గా ఉన్నాడు. ఇండస్ట్రీలో 'శ్రీమంతుడు' గురించి టాక్ బాగుంది'' అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు.


ఆడియో పంక్షన్ విశేషాలు..ఫొటోలు..స్లైడ్ షోలో..


 తొలి సీడీని ...

తొలి సీడీని ...

ఈ చిత్రం తొలి సీడిడి హీరో వెంకటేష్‌ ఆవిష్కరించారు.తొలి సీడి స్వీకరణ

తొలి సీడి స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వీకరించారు.మహేష్‌ బావ, గుంటూరు ఎంపీ జయదేవ్‌ గల్లా మాట్లాడుతూ ....

మహేష్‌ బావ, గుంటూరు ఎంపీ జయదేవ్‌ గల్లా మాట్లాడుతూ ....

''శ్రీమంతుడు' కుటుంబ కథా చిత్రమని మహేష్‌ చెప్పాడు. ఈ సినిమాకి నా కొడుకు అశోక్‌ సహాయ దర్శకుడిగా చేశాడు''అన్నారు.గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ....

గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ....

''ప్రచార చిత్రాలు చూస్తుంటే 'శ్రీమంతుడు' మంచి సందేశంతో తెరకెక్కిన చిత్రమని అర్థమైంది. గ్రామాల్ని దత్తత తీసుకోవాలనీ, దత్తత తీసుకోవడమంటే రోడ్లు, రంగులు వేసి వెళ్లిపోవడం కాదని ఇందులో చెప్పారు. మనుషుల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో చిత్రాన్ని మహేష్‌లాంటి కథానాయకుడు చేయడం ఆనందంగా ఉంది''అన్నారు.


సుధీర్‌బాబు మాట్లాడుతూ ....

సుధీర్‌బాబు మాట్లాడుతూ ....

''శ్రీమంతుడు' అనగానే ఏ లగ్జరీ కార్లోనో వస్తాడనుకొన్నా. మహేష్‌ మాత్రం సైకిల్‌పై వచ్చాడు. మహేష్‌ అందంలోనే కాదు గుణంలోనూ, అభిమానంలోనూ శ్రీమంతుడే'' అన్నారు.


జగపతిబాబు మాట్లాడుతూ...

జగపతిబాబు మాట్లాడుతూ...

''మహేష్‌ అభిమానులు ఆత్రుతగా, ఆవేశంగా పెద్ద విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ విజయమే 'శ్రీమంతుడు'. కొంతకాలం క్రితం ఓ హీరో 'దేవుడు అందమంతా మహేష్‌కే ఇచ్చాడ'అని చెప్పాడు. అందమే కాదు ఓర్పు, సహనం, అల్లరి కలిపి మహేష్‌కి ఇచ్చాడు. అందగాడైన మహేష్‌బాబుకి నేను బాబుగా నటించా'' అన్నారు.వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ...

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ...

''కొరటాల శివ అంటే నాకు ఇష్టం. ఆయన సినిమా బాగా తీస్తాడు. మహేష్‌బాబుతో రూ.100 కోట్ల వ్యయంతో ఓ సినిమా తీయాలనుంది. మంచి కథ సిద్ధమవుతోంది''అన్నారు.


కొరటాల శివ మాట్లాడుతూ ...

కొరటాల శివ మాట్లాడుతూ ...

''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.


శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ...

శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ...

''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.వెంకటేష్‌ మాట్లాడుతూ...

వెంకటేష్‌ మాట్లాడుతూ...

''ట్రైలర్‌ చూశాక నేను రెండు సైకిళ్లు కొని ప్రాక్టీస్‌ చేసి తొక్కాను. ఆ సైకిల్‌పై నేను రఫ్‌గా కనిపిస్తా. మా చిన్నోడు అందంగా కనిపించాడు. అదెందుకో మనందరికీ తెలుసు. 'శ్రీమంతుడు' చూశాక మనందరికీ దిమ్మతిరిగిపోద్ది. రికార్డులు బద్దలవుతాయు''అన్నారు.మహేష్‌బాబు మాట్లాడుతూ...

మహేష్‌బాబు మాట్లాడుతూ...

''అన్నయ్య వెంకటేష్‌గారికి కృతజ్ఞతలు. ఈ వేడుకకి వచ్చిందుకు. దేవి అంటే నాకు చాలా ఇష్టం. 'జాగో జాగో...' పాట నా కెరీర్‌లోనే ఉత్తమ గీతంగా నిలుస్తుంది. కొరటాల శివ అద్భుతమైన రచయిత. నాకు చెప్పినదానికంటే బాగా తీశాడు. 'శ్రీమంతుడు' లాంటి సినిమా నాతో తీసినందుకు కృతజ్ఞతలు.మహేష్ కంటిన్యూ చేస్తూ...

మహేష్ కంటిన్యూ చేస్తూ...

ఈ సినిమా ఒప్పుకొన్నందుకు జగపతిబాబుగారికి కృతజ్ఞతలు. ఆయన తప్ప మరొకరు సెట్‌ అవ్వని పాత్ర అది. రాజేంద్రప్రసాద్‌గారు, సుకన్యగారు, రాహుల్‌ రవీంద్రన్‌ లాంటి నటులతో కలసి నటించడం చక్కటి అనుభవం.మహేష్ ఇంకేమన్నాడంటే...

మహేష్ ఇంకేమన్నాడంటే...

కమల్‌ హాసన్‌గారికి పెద్ద అభిమానిని. ఆయన కూతురితో కలసి సినిమా చేస్తాననుకోలేదు. అభిమానులు ఈసారి నా పుట్టినరోజుకి పెద్ద కానుక ఇస్తారని ఆశిస్తున్నాను''అన్నారు.గీత రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ....

గీత రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ....

''కథకి సరిపడేలా, అదే సమయంలో వాణిజ్య నేపథ్యం కోల్పోకుండా సందర్భోచితమైన పాటలు రాసే అవకాశం దొరికింది''అన్నారు.కృష్ణ మాట్లాడుతూ...

కృష్ణ మాట్లాడుతూ...

''50 ఏళ్లుగా ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. నాలాగే మహేష్‌ను ఆదరిస్తూ అభిమానిస్తున్నారు. 'శ్రీమంతుడు' పేరు బాగుంది. టీజర్‌, ట్రైలర్‌ అద్భుతంగా ఉన్నాయి.కృష్ణ గారు కంటిన్యూ చేస్తూ...

కృష్ణ గారు కంటిన్యూ చేస్తూ...

మహేష్‌ గ్లామరస్‌గా కనిపించాడు. మా సత్యమూర్తిగారి అబ్బాయి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించడం మరింత ఆనందాన్నిచ్చింది. అందరి ఆశీర్వచనాలతో సినిమా గొప్ప విజయాన్ని అందుకొంటుంది'' అన్నారు.విజయనిర్మల మాట్లాడుతూ.....

విజయనిర్మల మాట్లాడుతూ.....

''సినిమా పేరుతో పాటు ప్రచార చిత్రాలు బాగున్నాయి. వంద రోజుల పండక్కి మళ్లీ కలుసుకొందాం'' అన్నారు.కృష్ణకు సన్మానం

కృష్ణకు సన్మానం

కృష్ణ 50 ఏళ్ల నటప్రయాణాన్ని పురస్కరించుకొని ఆయనకి చిత్రబృందం ఘన సన్మానం చేసింది. కృష్ణను వెంకటేష్‌ పూలమాలతో సన్మానించారు. గంటా శ్రీనివాసరావు శాలువాతో సత్కరించారు.


శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ గల్లా జయదేవ్, నిర్మాత ఆదిశేషగిరి రావు, దర్శకులు శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, నటుడు సుధీర్‌బాబు తదితరులు పాల్గొని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.


ఇంకా ..ఎవరెవరు..

ఇంకా ..ఎవరెవరు..

ఈ వేడుకలో...చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, శ్రుతీహాసన్, నటుడు రాహుల్ రవీంద్రన్, కెమేరామన్ మది, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


English summary
The much-awaited audio of Mahesh Babu's "Srimanthudu" is finally launched at a grand function at Shilpakala Vedika in Hyderabad at 7.00 pm on Saturday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu